»   » తెరమీద మాత్రమే కాదు బయట కూడా హీరో: అందుకే పవన్ అంటే ఇంత అభిమానం

తెరమీద మాత్రమే కాదు బయట కూడా హీరో: అందుకే పవన్ అంటే ఇంత అభిమానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిహారిక చేతి మీద పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడిపించుకుందిట అనగానే చాలా మంది నాగబాబు కూతురు నిహారిక అనే అనుకున్నారు. బాబాయ్ పేరు చేతిమీద టటూ గా వేయించుకుందట అని కొన్ని వార్తలుకూడా రాసేసారు. నిహారిక చేతి మీద పవన్ కళ్యాణ్ పేరు టాటూ గా వేయించుకున్నది నిజమే కానీ ఈ నిహారికీ కొడిదెల నిహారికకాదు.

నిహారిక 20 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఆమెకు బలవంతపు పెళ్ళి చేశారు. కొన్నాళ్ళ తర్వాత భర్త పెట్టే హింసలు భరించలేక తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే సగం కాలిన గాయాలతో బయటపడ్డ ఆ అభిమాని ప్రస్తుతం తన లాంటి వారికి అండగా నిలుస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటుంది. అయితే తాను కోలుకోవటానికీ ఇంత ఆత్మవిశ్వాసం తో మరోనలుగురికి అండగా నిలబడేంత ధైర్యం తనలో కలగటానికీ స్పూర్థి పవన్ కళ్యాన్ అట. అందుకే తన చేతి మీద ఆయన పేరుని టాటూ గా వేయించుకోని ఆ పేరుని చూడటం ద్వారా నిత్యం స్పూర్తి పొందుతూంటానని తెలిపింది....

tatoo
 

ఇక పవన్ మీద జనం లో ఇంత అభిమానం ఎందుకు..? అనే ప్రశంకి సమాధానం ఇంకొకటి దొరికింది. కేవలం నటించటం వల్లనే అభిమానులని సంపాదించుకోలేదు పవన్, తన లైఫ్ స్టైల్, మనుషుల పట్ల ఉన్న అతని ప్రేమా ఇలాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు అతన్ని మరింత గా జనం లోకి తీసుకువెళ్ళాయి...

అలాంటి సంఘటనే ఇంకోకటి మంచులక్ష్మి నిర్వహించే మేముసైతం కార్యక్రమానికి వచ్చిన లక్ష్మీ అనే ఒక రిటైర్డ్ టీచ చెప్పిన మాటలు పవన్ అంటే ఇంకోసారి అభిమానం పెంచేలా ఉన్నాయి. తను నిర్వహించే వృద్దాశ్రమం కోసం సహాయం అడగటానికి వెళ్ళి ఇంట్లోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఇంటి ంకుందే నిలబడి పోతే. ఆఫీస్ కి వెళ్ళటానికి బయటకు వచ్చిన పవన్ ఆమెని గమనించి మాట్లాడటమే కాదు. ఆఫీస్ కి తీసుకువెళ్ళి ఆమె చెప్పిన కథ మొత్తం వింటూనే తనే కాఫీ కలిపి ఆమెకి ఇచ్చాడట.

మధ్యాహ్నం బొజనం కూడా ఆమె తోనే కలిసి చేసిన పవన్... తాను వృద్దాశ్రమం కోసం చేసే సహాయం కోసం చెక్ రాయటమే కాక... అదనం గా అప్పటికప్పుడు జేబులో ఉన్న మరో పదివేలు కూడా చేతిలో పెట్టి "ఇంతమంది అమ్మలను చూసుకుంటున్న మీరు నాకు మా అమ్మతో సమానం" అనిచెప్పి ఆమెని సాగనంపిన పవన్ ని తల్చుకొని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.

నటన వల్లే పవన్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోలేదు. చిరంజీవి తమ్ముడు అన్న ట్యాగ్ నుంచి తన మూదో సినిమాకే బయటకి వచ్చిన పవన్ తన ఇన్నేళ్ళ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ లే ఉన్నా ఆయన మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవటానికి కారణం పవన్ లో ఉన్న ఈ మానవీయ కోణమే....

English summary
Pwar Star Pwankalyan fan says About His helping nature and his concern about poor peaople in Manchu Lakshmi prasanna's memu saitham program
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu