For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ హీరోయిన్ ...గుర్రంపైనుంచి జారి పడింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో పులి చిత్రంలో చేసిన నిఖిషా పటేల్ గుర్తుండే ఉంటుంది. ఆమె ఓ కన్నడ చిత్రం షూటింగ్ లో భాగంగా గుర్రం స్వారీ చేస్తూ పడిపోయింది. దాంతో ఆమెకు బాగా దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియచేసింది.

  నిఖిషా ట్వీట్ చేస్తూ...గుర్రపు స్వారీ తొలిసారి గా చేసాను...ఎలోన్ చిత్రం కోసం...పడి బాగా దెబ్బలు తగిలాయి అంటూ ట్వీట్ చేసింది. ఆమె రీసెంట్ గా చేసిన కన్నడ చిత్రం నమస్తే మోడమ్ ...మంచి విజయం సాధించటంతో కన్నడంలో వరస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రెస్ట్ తీసుకుని తర్వాత కంటిన్యూ షూటింగ్ లో పాల్గొంటానని చెప్తోందీ భామ.

  డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయిన హీరోయిన్లలో నిఖిషా పటేల్‌ ఒకరు. గుజరాతీ అమ్మాయి అయినా లండన్‌ సమీపంలోని వేల్స్‌లో పుట్టి పెరిగింది. మిస్‌ వేల్స్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని ఫైనల్స్‌ వరకూ వచ్చింది 2006లో. గ్లామర్‌ ఫీల్డ్‌లోకి రావాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుందనే నిఖిషా, యాడ్‌ ఫిలిమ్స్‌లో నటించడంద్వారా కెరీర్‌ ప్రారంభించి ఇరవై యాడ్‌ ఫిలిమ్స్‌లో నటించి కెమెరా భయం పోగొట్టుకుందట.

  'కొమరం పులి' చిత్రం హీరోయిన్‌గా ఎంపికైనందుకు తన ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయినా తొలి షాట్‌లో నటించేటప్పుడు కెమెరా ముందుకు వెళ్ళగానే కంగారు, టెన్షన్‌ ఎక్కువయిందట. రెండు మూడు దృశ్యాల్లో నటించాక టెన్షన్‌ తగ్గి మామూలు స్థితికి చేరుకున్న నిఖిషా సినిమాల్లో నటించడం అంత సులువుకాదని, కోరినట్టుగా ఇన్‌స్టెంట్‌గా భావాలు పరికించడం కష్టమైనదే అంటుంది. డైలాగ్‌ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మనసుని స్వాధీనం చేసుకుని నటించగలిగితేనే మెప్పించగల మంటుంది నిఖిషా పటేల్‌. మొదటి చిత్రం వల్ల సక్సెస్‌ రాకపోయినా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

   Nikesha Patel injured while doing Horse riding

  కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె రీసేంట్ గా మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తను బిజీ కాకపోవటానికి కారణం 'పులి" చిత్రమేనని మరోసారి స్పష్టం చేసింది. నాకు కథ చెప్పినప్పుడు, స్క్రిప్టు చూసినపుడు చాలా బాగా ఉండడంవల్లే ఆ చిత్రంలో నటించాను. నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా మరో చిత్రం ద్వారా పరిచయం అయ్యేదానిని. కానీ నేననుకున్నట్టు జరగకపోవడంతో నా కెరీర్ సజావుగా లేదని అని వాపోయింది

  అలాగే పందొన్నిమిది ఏళ్ల వయసులో ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు కాలం అంతా వృధా చేసుకున్నానని, చిత్రం ఫ్లాపైనా పవన్‌ కల్యాణ్, దర్శకుడు సూర్య తమ చిత్రాలతో బిజీగా ఉన్నారని వాళ్ళకు పడి ఏడుస్తోంది.

  English summary
  Nikesha tweeted ...Horse riding for the first time in #aaalone and #karaioram sets. Badly bruised.The actress reportedly suffered injuries while doing horse riding in shooting of a Kannada film ‘’Aaalone" and Tamil thriller "Karaioram" and it has left her badly bruised.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X