»   » బాహుబలి-2 ఇష్యూ : దర్శకుడు తెలియదా? స్టుపిడ్ అంటూ హీరోయిన్ ఫైర్!

బాహుబలి-2 ఇష్యూ : దర్శకుడు తెలియదా? స్టుపిడ్ అంటూ హీరోయిన్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమా విషయమై పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' మూవీ హీరోయిన్ నికేషా పటేల్ చేసిన ట్వీట్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తనకు బాహుబలి-2 మూవీ దర్శకుడు ఎవరో తెలియదు అంటూ.... ఓ తెలుగు యాక్టర్ అనడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

బాహుబలి-2 మూవీ తెలుగు సినిమా పరిశ్రమ పరిధిని దాటి ఇండియన్ మూవీ పరిశ్రమ గర్వపడేలా.... పెద్ద హిట్టయింది. అలాంటి సినిమా గురించి, ఆ సినిమా దర్శకుడి గురించి ఓ తెలుగు నటుడు తెలియదు అని అనడం ఏమిటి అంటూ మండి పడింది.


స్టుపిడ్ అంటూ ట్వీట్స్

ఇటీవ‌ల ఓ తెలుగు హీరోను 'బాహుబ‌లి-2: ద కన్ క్లూజన్' సినిమా చూశావా' అని అడిగాను. దానికి అతడు నన్ను ఆ సినిమా ద‌ర్శ‌కుడెవ‌రు?' అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు. ఓ స్టుపిడ్ లా అతడు సమాధానం చెప్పడం చూసి ఆశ్చర్యం వేసింది, అతడి తీరు చూసి సిగ్గేసింది అంటూ నికేషా పటేల్ ట్వీట్ చేసింది.


అతడి పేరు పలకడం కూడా ఇష్టం లేదు

బాహుబలి సినిమా గురించి అలా మాట్లాడిని ఆ తెలుగు యాక్టర్ ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది. ఆ యాక్టర్ పేరుచెప్పమని కొందరు అభిమానులు కోరగా.... అతడి పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదని, అలాంటి వ్యక్తి పేరు చెప్పడానికి తాను సిగ్గు పడుతున్నానని నికేషా పటేల్ సమాధానం ఇచ్చింది.


వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

తెలుగు సినిమా 'బాహుబలి-ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించి ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టి నెం.1 స్థానం దక్కించుకోవడంతో కొందరు పెద్దస్టార్స్ ఈర్ష్య పడుతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు? అంటే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పే పేరు దర్శకుడు రాజమౌళి. మరి రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు వివరాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
"I asked one telugu actor "have you watched baahubali replied "who directed that?"How ignorant and stupid and artificial are you..shame on u. Feel too ashamed to mention his name.....how daft!" Nikesha Patel tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu