»   » వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా 'బాహుబలి-ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించి ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టి నెం.1 స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో బాలీవుడ్ ఖాన్ లు నటించిన సినిమాల రికార్డులు మాత్రమే ఉండేవి.

రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించడం ద్వారా ఇపుడు వాటన్నింటికీ బద్దలు కొట్టి సత్తా చాటింది మన తెలుగు సినిమా. బాహుబలి అఖండ విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ సినిమా హాట్ టాపిక్ అయింది.


దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని పరిశ్రమల నటుల నుండి ప్రశంసలు వస్తున్నాయి... బాలీవుడ్ ఖాన్ త్రయం మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమాపై మాట్లడలేదు. దీంతో బాహుబలి విజయాన్ని చూసి వారు ఈర్ష్య పడుతున్నారని, అందుకే ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడటం లేదనే ప్రచారం మొదలైంది.


కోన వెంకట్ ట్వీట్

కోన వెంకట్ ట్వీట్

బాలీవుడ్ సినిమాలకు సైతం పని చేసిన తెలుగు రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.... మన స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ బాహుబలి-2ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. బాలీవుడ్ ఖాన్ త్రయం మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమాపై స్పందించ లేదు, వీరికి బాహుబలి విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?.... అంటూ ట్వీట్ చేసారు.


దేశం గర్వ పడే మూవీ... యాక్సెప్ట్ చేయండి

దేశం గర్వ పడే మూవీ... యాక్సెప్ట్ చేయండి

ఎవరైనా దేశం గర్వపడే పని చేస్తే.... మతం, ప్రాంతాలతో లింకు పెట్టి చూడొద్దు. బాహుబలి-2 మూవీ అంతకు మించిన విజయం సాధించింది..... ప్రపంచ స్థాయిలో దేశ సినీ పరిశ్రమ గర్వపడేలా చేసింది, యాక్సెప్ట్ చేయండి అంటూ కోన ట్వీట్ చేసారు.
‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి' రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


పెళ్లి వేడుకలో ‘బాహుబలి-2’ మేనియా... (సోషల్ మీడియాలో హాట్ టాపిక్)

పెళ్లి వేడుకలో ‘బాహుబలి-2’ మేనియా... (సోషల్ మీడియాలో హాట్ టాపిక్)

పెళ్లి వేడుకలో ‘బాహుబలి-2' మేనియా... సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Telugu writer Kona Venkat. He tweeted that "It's really great to see our stars PawanKalyan , urstrulyMahesh & tarak9999 appreciating #Bahubali2 , why the''Khan''are still silent??z".. "When someone makes our country proud, we don't look at their region or religion.. Bahubali2 achieved beyond boundaries.. Let's accept !!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu