twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో క్లిప్ చూసాకే నాకు అర్దమైంది,ఆ వెంటనే... : రైటర్ విజయేంద్రప్రసాద్ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ :మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం 'జాగ్వార్‌'. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేసారు.ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.


    దాదుపు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బాహుబలి', 'భజరంగి భాయ్‌జాన్‌' చిత్రాలతో సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు.

    50కి పైగా చిత్రాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేసిన యస్‌.యస్‌. థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. 'రేసుగుర్రం', 'బ్రూస్‌లీ' వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసిన మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ పొటోగ్రఫిగా వర్క్‌ చేస్తున్నారు.

    హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఎన్నో హిట్‌ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌చేసిన రవివర్మ, రామ్‌లక్ష్మణ్‌, సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు.

    టీజర్ విడుదల లాంచ్ ఫొటోలు...

    పెద్దలు చేతుల మీదుగా..

    పెద్దలు చేతుల మీదుగా..

    ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, నిర్మాత అల్లు అరవింద్‌ ఫస్ట్ టీజర్ ని విడుదల చేశారు.

    హెచ్‌.డి.కుమారస్వామి మాట్లాడుతూ....

    హెచ్‌.డి.కుమారస్వామి మాట్లాడుతూ....

    ‘‘ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం విజయేంద్రప్రసాద్‌. కథ చెప్పాక ఆయన ‘మీ అబ్బాయి మంచి హీరో అవుతాడు, కన్నడతో పాటు, తెలుగులోనూ ఈ సినిమాని చేయండి' అన్నారు.

    ఆశీర్వాదం కావాలి

    ఆశీర్వాదం కావాలి

    కన్నడంలో రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక ప్రదర్శనకారుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పంపిణీదారుడిగా, ఆ తర్వాత నిర్మాతగా మారా. హీరోగా పరిచయమవుతున్న నా బిడ్డని తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకొంటున్నా కుమారస్వామి.

    సంతోషకరమైన రోజు

    సంతోషకరమైన రోజు

    నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు ఇది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ‘జాగ్వార్‌' కోసం దర్శకుడు మహదేవ్‌ చాలా కష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో విడుదలవుతున్న చిత్రాల్లో అత్యుత్తమమైనదిగా నిలుస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు హీరో తండ్రి .

    హీరో నిఖిల్ మాట్లాడుతూ....

    హీరో నిఖిల్ మాట్లాడుతూ....

    ‘‘రచయిత విజయేంద్రప్రసాద్‌ మా నాన్నని కలవడానికి వచ్చినప్పుడు ‘మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకొని నా చేతుల్లో పెట్టండి' అన్నారు. నాకోసం ఓ మంచి కథని సిద్ధం చేశారు.

    తెలుగంటే ఇష్టం

    తెలుగంటే ఇష్టం


    నా వంతుగా శ్రమించా. మహదేవ్‌ ఎంతో తపనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నన్నెప్పుడూ తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటారాయన. నాకూ తెలుగంటే ఇష్టం. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటా'' అన్నారు హీరో నిఖిల్ గౌడ్.

    విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ....

    విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ....

    ‘‘నిఖిల్‌కి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ని చూశాక తనలో ఓ మెరుపు ఉందన్న విషయం నాకు అర్థమైంది. ఆ వెంటనే తనకోసం ఈ కథ రాశా. నాపై నమ్మకంతో నిఖిల్‌ని అప్పగించారు కుమారస్వామి. ఎంతో తపనతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు మహదేవ్‌. చిత్ర యూనిట్ అంతటికీ మంచి ఫలితం లభిస్తుంది''అన్నారు.

    వజ్రం ఇది

    వజ్రం ఇది

    వజ్రాన్ని సానపెట్టినట్లుగా నిఖిల్‌ను ఈ సినిమా కోసం సిద్ధంచేశామని, అతడు పడిన కష్టం టీజర్‌లో కనిపిస్తుందని, తండ్రికి తగ్గ తనయుడిగా నిఖిల్ నిరూపించుకోవాలని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

    అల్లు అరవింద్ మాట్లాడుతూ..

    అల్లు అరవింద్ మాట్లాడుతూ..

    ‘‘కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు తండ్రి పడే తపన ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ తపన కుమారస్వామిలోనూ చూస్తున్నా. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఎవ్వరైనా కష్టపడాల్సిందే. ప్రచార చిత్రం చూస్తుంటే నిఖిల్‌లో ఆ కష్టపడే తత్వం స్పష్టంగా కనిపిస్తోంది''అన్నారు అల్లు అరవింద్‌.

    టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ...

    టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ...


    ‘‘కుమారస్వామి రాజకీయ, సినీరంగాల్లో ఎన్నో విజయాలు సాధించారు. అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిలాగే మెలుగుతుంటారు. ఆయనకి సినిమాలంటే మక్కువ. ఆయన తనయుడు కన్నడతోపాటు, తెలుగు, తమిళంలోనూ మంచి హీరోగా నిరూపించుకొంటాడు''అన్నారు టి.సుబ్బరామిరెడ్డి.

    గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ...

    గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ...

    ‘‘ టీజర్ బాగుంది. నిఖిల్‌ మంచి హీరోగా విజయం సాధిస్తాడు. కుమారస్వామి సినిమా రంగంతోపాటు, రాజకీయల్లోనూ మరింతగా రాణించాలని కోరుకొంటున్నా'' అన్నారు

     జగపతిబాబు మాట్లాడుతూ..

    జగపతిబాబు మాట్లాడుతూ..


    రాజకీయాలకంటే సినిమాలంటేనే కుమారస్వామి మక్కువ ప్రదర్శిస్తారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు అని జగపతిబాబు పేర్కొన్నారు.

    దర్శకుడు మహదేవ్‌ మాట్లాడుతూ...

    దర్శకుడు మహదేవ్‌ మాట్లాడుతూ...

    ‘‘కథ విన్నాక అందులోని పాత్రకి తగ్గట్టుగా ఒక ఏడాదిపాటు సన్నద్ధమయ్యాడు నిఖిల్‌. చిత్రంలో ఉత్తమ నటనని కనబరిచారు. నటీనటులు, సాంకేతిక బృందంలో ఎక్కువగా తెలుగువాళ్లే ఉండటంతో ఇది ఓ తెలుగు సినిమాగానే భావించి పనిచేశా'' అన్నారు.
    ఎవరెవరు..

     వీడియో క్లిప్ చూసాకే నాకు అర్దమైంది,ఆ వెంటనే... : రైటర్ విజయేంద్రప్రసాద్ (ఫొటోలు)

    వీడియో క్లిప్ చూసాకే నాకు అర్దమైంది,ఆ వెంటనే... : రైటర్ విజయేంద్రప్రసాద్ (ఫొటోలు)

    గంటా శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జగపతిబాబు, డి.సురేష్‌బాబు, కె.ఎస్‌.రామారావు, సి.కల్యాణ్‌, కె.అశోక్‌కుమార్‌, రఘురామకృష్ణంరాజు, కుపేంద్రరెడ్డి, పుట్టరాజు.సి.యస్‌, తమన్‌, రామ్‌లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

    కళాదర్శకత్వం...

    కళాదర్శకత్వం...

    ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు వర్క్‌చేసిన నారాయణరెడ్డి కళా దర్శకత్వం వహిస్తున్నారు.

    హై టెక్నీషియన్స్ తో ..

    హై టెక్నీషియన్స్ తో ..

    హేమాహేమీలైన సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌వాల్యూస్‌తో 'జాగ్వార్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా హెచ్‌.డి. కుమారస్వామి నిర్మిస్తున్నారు.

    సెన్సేషన్ హిట్ గా..

    సెన్సేషన్ హిట్ గా..


    అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో వేస్తున్న భారీ సెట్స్‌లో జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తి చేసుకునే 'జాగ్వార్‌' చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలవాలని అదంరూ కోరుకున్నారు.

    ఛేజ్, ఫైట్స్ ..

    ఛేజ్, ఫైట్స్ ..


    ముఖ్యంగా బల్గేరియాలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయి.

    అన్నిటినీ...

    అన్నిటినీ...


    ఈ చిత్రంలోని అన్ని పాటల్ని ప్రముఖ గేయరచయిత రామజోగయ్యశాస్త్రి రాశారు.

    విలక్షణమైన పాత్రలో

    విలక్షణమైన పాత్రలో


    నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు.

    స్పెషల్ పాత్రలో

    స్పెషల్ పాత్రలో


    ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌, ఆదిత్యమీనన్‌, సుప్రీత్‌, రవికాలే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు

    English summary
    Former Prime Minister Deva Gowda's grandson, Former Karnataka Chief Minister HD Kumara Swamy's son introducing his son Nikhil Kumar as hero through Jaguar movie, first look of the film launched today (31st July) morning at Park Haytt Hotel in Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X