»   » బూతులు మాట్లాడుతూ దూల తీర్చుకొంటున్న నిఖిల్

బూతులు మాట్లాడుతూ దూల తీర్చుకొంటున్న నిఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'హ్యాపీ డేస్, 'యువత" చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ నటుడు నిఖిల్, కొత్త బండారు లోకం హీరోయిన్ స్వేతబసు ప్రసాద్, నిఖిల్ ప్రస్తుతం ఎల్ సురేష్ దర్శకత్వంలో 'కళవర్ కింగ్" చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా కొద్ది రోజులుగా మీడియాలో హడావిడి చేస్తున్న నిఖిల్ నోట పదే పదే ఓ బూతు మాట విన్పిస్తోంది. అదేమిటంటే 'దూల తీరిందా.." అంటూ సిగ్గు యెగ్గు లేకుండా నిఖిల్ మీడియా ముందు హల్ చల్ చేస్తున్నాడు. నిఖిల్ అంతలా నోటి దూల తీర్చుకోవడానికి కారణం ఆ సినిమాలోని 'దూల తీరిందా.." అనే పాట వుండడమే.

ఆ పాటను పదే పదే పాడ్డమే కాదు, నిఖిల్ ని ఆ సమయంలో చూసిన వారు జుగుప్సగా ఫీలవుతున్నా, తాను మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే అతనికి హీరోగా వున్న గుర్తింపును కాస్తా, 'దూల తీరిందా.." అన్న తన నోటి దురద తో నిఖిల్ చెడగొట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల మన్ననలు పొందుతూ కెరీర్ కి దగ్గరవుతున్న సమయంలో అత్యుత్సాహం శృతిమించకుండా వుంటే, మంచి నటుడిగానే కాదు, వ్యక్తిత్వంలోనూ నిఖిల్ ఔన్నత్యాన్ని చాటుకున్నవాడవుతాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu