»   »  75 కోట్ల బడ్జెట్ ‘జాగ్వార్‌’ .. తెలుగు ట్రైలర్ ఇదిగో (వీడియో)

75 కోట్ల బడ్జెట్ ‘జాగ్వార్‌’ .. తెలుగు ట్రైలర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌నువ‌డు నిఖిల్ గౌడ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ద‌ర్శ‌కుడు మ‌హాదేవ్ రూపొందించిన చిత్ర 'జాగ్వార్‌'. సుమారు 75 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 18న హైద‌రాబాద్‌లో ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రుపుకుంది, అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుండడం ఈ సినిమాకు అంచనాలను పెంచింది.


Nikhil Kumar's Jaguar - Telugu Theatrical Trailer

ఇప్ప‌టికే ద‌స‌రా బ‌రిలో చాలా సినిమాలు రెడీగా ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమాను కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర‌య్యారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో తెలుగు ప్రజలు ముందుంటారన్నారు. జాగ్వార్ ట్రైలర్, పాటల్లో నిఖిల్ పడిన కష్టం కనిపిస్తుందని పేర్కొన్నారు. తాతగారు దేవెగౌడ, అమ్మానాన్నల పేరును నిఖిల్ నిలబెట్టుతాడనే నమ్మకముందని తెలిపారు.

English summary
Nikhil Kumar who has produced several films in Kannada and is the grandson of former Prime Minister H D Devegowda will be debuting as a hero in the film Jaguar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu