»   » చనిపోయాక బరువు పై నిఖిల్ ప్రశ్న... ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ టీజర్

చనిపోయాక బరువు పై నిఖిల్ ప్రశ్న... ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్‌ మరో వినూత్నమైన కథాంశంతో చేస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. హెబ్బాపటేల్‌, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'టైగర్‌' ఫేం వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.'మరణం దేహానికే కానీ ఆత్మకు కాదని భగవద్గీత చెబుతుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్‌ చెబుతుంది. అంటే 21 గ్రాముల బరువు.. ప్రేమ..? సంతోషం..?, పగ..? బాధ..? ఇవన్నీ కొలువై మరణానంతరం శరీరాన్ని విడిచి వెళ్లే ఆత్మ' అని ఆత్మకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం దర్శకుడు వి.ఐ.ఆనంద్‌.


నిర్మాతలు మాట్లాడుతూ ''ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు సినిమా ఇండిస్టీ నుండే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ పేరు వచ్చింది. ట్రేడ్‌ బిజినెస్‌ వర్గాల్లో క్రేజ్‌ వచ్చింది. ట్రెండ్‌లో ఉంటూనే ఎంటర్‌టైనింగ్‌ చేయటంలో నిఖిల్‌, ఆనంద్‌ సిద్ధహస్తులే అని మరోక్కసారి ఈ చిత్రం ప్రూవ్‌ చేస్తుంది. ఇప్పిటికే ఈ సినిమా టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వుతుండటం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో శేఖర్‌ చంద్ర అందించిన ఆడియోని విడదల చేస్తాం'' అని అన్నారు.


'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో హెబ్బాపటేల్‌, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. మేఘనా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి
శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. నవంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా.. పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి, ఆర్ట్‌- రామాంజ‌నేయులు, ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌, సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌, మాట‌లు- అబ్బూరి ర‌వి డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌, నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌ స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌.

English summary
Nikhil starring Ekkadiki Pothavu Chinnavada teaser has been released.Ekkadiki Pothavu Chinnavada first look teaser looks captivating with an interesting plotline that has been highlighted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu