»   » గుమ్మిడికాయ కొట్టేసారు..హీరోగారు హ్యాపీ

గుమ్మిడికాయ కొట్టేసారు..హీరోగారు హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గుమ్మిడికాయ కొట్టడం అంటే సినిమావారి పరిభాషలో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లే. దాదాపు నాలుగైదు నెలలుపాటు రాత్రింబవళ్లు కష్టపడిన షూటింగ్ చివరి రోజుని ఇలా గుమ్మిడికాయ కొట్టి...ముగింపుని సెలబ్రేట్ చేసుకుంటారు. నిఖిల్‌, స్వాతి హీరోహీరోయిన్లుగా మాగ్నస్‌ సినిప్రైమ్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ' కార్తికేయ'. ఈ చిత్రం గుమ్మిడికాయ కొట్టేసారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇక రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఆగస్టు 1 న విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసం తాను నిద్రకూడా పోకుండా ఎదురుచూస్తున్నట్లు నిఖిల్ అన్నారు.

చిత్రం కథ విషయానికి వస్తే... దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ జరిగే సంఘటనలతో ఆసక్తికరంగా ఓ మిస్టరీలా అల్లుకున్న కథనంతో సాగుతుంది. ఇప్పడిటే విడిదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

Nikhil's Karthikeya breaks Gummadikaya

ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

English summary
Nikhil tweeted "Last day of song Patch Work for Karthikeya Today :-) Gummadikai after Pack Up Tonight :-) AUGUST 1ST Release Targeted".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu