»   » నిఖిల్ ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్ రికార్డ్

నిఖిల్ ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్వామి రారా' చిత్రం మంచి విజయం సాధించడంతో అతని తర్వాతి సినిమా 'కార్తికేయ'పై మంచి అంచనాలున్నాయి. 'కార్తికేయ' చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడానికి పలు టీవీ ఛానల్స్ పోటీ పడ్డాయి. తాజాగా 'కార్తికేయ' శాటిలైట్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లో వచ్చిన సినిమాలన్నింటికంటే ఈ చిత్రం శాటిలైట్స్ ఎక్కువ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

Nikhil's Karthikeya Satellite Rights Sold For A Record Price

ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం...జెమినీ టీవీ వారు 'కార్తికేయ' శాటిలైట్ రైట్స్ రూ. 1.4 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు 'స్వామి రారా' చిత్రం శాటిలైట్ రైట్స్ 1.10 కోట్లకు జెమినీ టీవీ వారే కొనుగోలు చేసారు. ఆ మధ్య విడుదలైన 'కార్తికేయ' టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండటం కూడా ఈ రేటు రావడానికి కారణమని తెలుస్తోంది.

కార్తికేయ చిత్రం సూపర్ నాచురల్ సస్పెన్స్ థ్రిలర్‌గా తెరకెక్కుతోంది. చందూ మొండేటి అనే కొత్త దర్శకుడు స్వయంగా కథ రాసుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక విలేజ్ బ్యాక్ డ్రాపులో ఈచిత్ర కథ నడుస్తుంది. కొన్ని కారణాల వల్ల మూత పడ్డ సుబ్రహ్మణ్య స్వామి గుడి నేపథ్యంలో కథ సాగుతుంది.

స్వామి రారా చిత్రంలో జంటగా నటించిన నిఖిల్, స్వాతి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
According to reports, Gemini TV, which had acquired the rights of Swamy Ra Ra, has now bagged the satellite rights of Karthikeya. The TV channel has reportedly shelled out a hefty sum of Rs 1.4 crore. Swamy Ra Ra had fetched approximately Rs 1.10 crore from TV rights and it was biggest price for Nikhil's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu