షూటింగ్ పూర్తి..గుమ్మిడికాయ కొట్టేసారు
హైదరాబాద్: నిఖిల్, నందితలు జంటగా నటిస్తున్న 'శంకరాభరణం' చిత్రం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని నిఖిల్ తన అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ లలో ఖాతా ద్వారా తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
ఈ చిత్రానికి ఉదయ్ నందనవనం దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. అంజలి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. నిఖిల్, నందిత, అంజలిలతోపాటు సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే తన ఫన్నీ ఫొటోలు మీరు చూడాలంటే ఈ లింక్ ని ఫాలో అవడంటూ మరో ట్వీట్ చేసాడు నిఖిల్..
‘శంకరాభరణం' విశేషాలకు వస్తే...
ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మించి విడుదలకు రెడీ అవుతునున్నారు. ఈ సారి ఆయన హీరో నిఖిల్ తో ముందుకు వెళ్తున్నారు.‘శంకరాభరణం' టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్.
ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.

నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.
కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -''ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.


Click it and Unblock the Notifications











