»   » క్రేజ్ కోసం కావాలనే లీక్ చేసారా... (వీడియో)

క్రేజ్ కోసం కావాలనే లీక్ చేసారా... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏదన్నా చిత్రంలో పాట కాని సీన్ కానీ లీక్ అయ్యిందంటే ఆ ఉత్సాహమే వేరు. జనం ఎగబడి చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు కావాలని తమ చిత్రంలోని సన్నివేశాలను మీడియా అండతో విడుదల చేసి లీక్ అనే ముద్రతో జనంలోకి వదలటం జరుగుతోంది. దాంతో నిజంగా లీక్ అయ్యిందేంటో...లేక కావాలని లీక్ చేసిందేంటో తెలియని స్ధితి ఏర్పడుతోంది.

తాజాగా నిఖిల్ తాజా చిత్రం ‘శంకరాభరణం' చిత్రంలోని 34 సెకన్ల నిఖిల్ డాన్స్ వీడియో ఒకటి లీక్ అంటూ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో సింగిల్ షాట్ లో చేసిన సీక్వెన్స్ ఇది. అయితే ఈ వీడియో కావాలనే క్రేజ్ కోసం లీక్ చేసారని కొందరంటున్నారు. ఏది ఎలా ఉన్నా నిఖిల్ మాత్రం డాన్స్ అదరకొట్టారు. ఆ వీడియోని చూడండి ఇక్కడ...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘శంకరాభరణం' చిత్రం విషయానికి వస్తే...

కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్. ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వుతున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.

Nikhil Shankarabharanam leaked song!

నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.

కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.

English summary
A 34-second footage of song shoot happening on the sets of 'Shankarabharam' is now doing rounds on the web.
Please Wait while comments are loading...