For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిఖిల్ 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' సినిమా పరిస్థితేంటి?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: 'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా 21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

  ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెద‌టిలుక్ కి విప‌రీత‌మైన స్పంద‌న రావ‌టం తెలిసిన విష‌య‌మే. చూసిన ప్ర‌తిఓక్క‌రూ టైటిల్ చాలా వినూత్నంగా వుంద‌ని సోష‌ల్ మీడియాలో వారి స్పంద‌న‌లు తెలిపారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిక్‌మంగ్‌లూర్ లో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి టోట‌ల్ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

  Nikhil Siddhartha's Ekkadiki Potavu Chinnavada movie update

  ఈ సంధర్బం గా నిర్మాత‌లు మాట్లాడుతూ" మా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో విజ‌యాల్ని సోంతంం చేసుకున్న నిఖిల్‌ హీరోగా, స‌క్స‌స్‌ఫుల్ బ్యూటీస్‌ హెబాప‌టేల్, నందిత శ్వేత ల కాంబినేష‌న్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మాచిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' నిర్మిస్తున్నాము. ' టైగ‌ర్' లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రం త‌రువాత మా ద‌ర్శ‌కుడు ఆనంద్ చాలా కొత్త గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మా హీరో నిఖిల్ భ‌ర్త‌డే కి గిఫ్ట్ గా విడుద‌ల చేశాము. సినిమా ఇండ‌స్ట్రి నుండే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి అప్లాజ్ రావ‌టం అంతేకాకుండా ట్రేడ్ బిజినెస్ వ‌ర్గాల్లో క్రేజ్ వ‌చ్చింది.

  ట్రెండ్ లో వుంటూనే ఎంట‌ర్‌టైనింగ్ చేయ‌టంలో మా హీరో నిఖిల్‌, ద‌ర్శ‌క‌డు ఆనంద్ సిద్ధ‌హ‌స్తులే అని మ‌రోక్క‌సారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది. ఇప్పిటికే ఈ సినిమా టైటిల్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వుతుండ‌టం చాలా హ్య‌ాపీగా వుంది. త్వ‌ర‌లో శేఖ‌ర్ చంద్ర అందించిన‌ ఆడియో ని విడ‌ద‌ల చేస్తాము. ఈనెల 12కి చిత్రం టాకీ కంప్లీట్ చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తాము. తెల‌గు ప్రేక్ష‌కులంద‌రికి వినాయ‌క చ‌వ‌తి శుభాకాంక్ష‌లు" అని అన్నారు

  Nikhil Siddhartha's Ekkadiki Potavu Chinnavada movie update

  నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

  పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,

  ఆర్ట్‌- రామాంజ‌నేయులు,

  ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,

  సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,

  మాట‌లు- అబ్బూరి ర‌వి

  డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,

  నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌

  స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌.

  English summary
  Nikhil Ekkadiki Pothavu Chinnavada To Release In October. VI Anand has written the story and screenplay and directed "Ekkadiki Pothavu Chinnavada," which is produced by PV Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X