»   » సినిమా డిస్ట్రిబ్యూషన్ తో దూళ దీర్చుకొంటున్నా నిఖిల్!

సినిమా డిస్ట్రిబ్యూషన్ తో దూళ దీర్చుకొంటున్నా నిఖిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాఫీడేస్ చిత్రం ద్వారా పరిచయమైన యంగ్ హీరో నిఖిల్ 'అంకిత్ పల్లవి అండ్ ప్రేండ్స్", 'యువత" చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. నిఖిల్ సోలో హీరో గా నటించిన చిత్రం 'కళావర్ కింగ్" ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది. నిఖిల్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్ దర్వకత్వం వహించారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎం.చంద్ర శేఖర్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ దర్శకత్వం వహించారు.

హీరో నిఖిల్, విలన్ పాత్రధారి అజయ్ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనీ, ఆ ఇద్దరూ పోటీపోటీగా నటించారనీ నిర్మాతలు చెబుతున్నారు. అలాగే శ్వేతబసు గ్లామర్ తో కూడిన అభినయం, కామెడీ ట్రాక్, నువ్వు నేనుచిత్రంతో పరిచయమైన అనిత ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. సో యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. అందుకే హీరో నిఖిల్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెడుతుండటం విశేషం. సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎంతగానో నచ్చడంతో నిఖిల్ తొలిసారి ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నారు. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల్లో ఈ చిత్రాన్ని ఆయన పంపిణి చేయనున్నారు.

ఇన్నాళ్ళు దూల తీరిందా అంటూ టీవీ చానల్లలో బూతులు మాట్లాడుతూ దురద తీర్చుకొన్న నిఖిల్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టి ఇతర దేశాల్లో కూడా తన పేరు మారు మ్రోగాలని దూలతీర్చుకొంటున్నాడు. ఏది ఎలావున్నా నిఖిల్ కి ఆల్ ది బెస్ట్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu