»   » నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్

నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విభిన్న చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారి అలరిస్తూ వస్తున్నయంగ్ హీరో నిఖిల్‌. 'స్వామి రారా'.. 'కార్తికేయ'.. 'సూర్య వర్సెస్‌ సూర్య' చిత్రాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇదీ ఓ వైవిధ్యమైన ప్రేమ కథ అని చెప్తున్నారు.

నిఖిల్‌ హీరోగా మేఘన ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్‌, నందిత శ్వేత హీరోయిన్స్. 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకొన్న ఈ సినిమాకి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే పేరును ఖరారు చేశారు. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

నిర్మాతలు మాట్లాడుతూ..''వైవిధ్యమైన ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానం చాలా బాగుంది. నిఖిల్‌ ఇందులో కనిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే టీజర్‌ని, పాటల్ని విడుదల చేస్తాం. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అని తెలిపారు.

Nikil's Ekkadiki Pothavu Chinnavaada First Look

'ఆత్మబలం' చిత్రంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా' అంటూ ఓ పాట ఉంటుంది. ఇప్పుడు ఆ పాటనే నిఖిల్‌ కూడా గుర్తుచేస్తున్నాడన్నమాట. 'శంకరాభరణం' తరవాత నిఖిల్‌ నుంచి వస్తున్న చిత్రమిదే. 'శంకారభరణం' అనుకొన్న ఫలితం తీసుకురాకపోవడంతో ఈ సినిమాపై దృష్టిని కేంద్రీకరించాడు నిఖిల్‌.

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శన్, భ‌ద్రమ్‌, అపూర్వ శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించగా... పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్త్రి, శ్రీమ‌ణి, ఆర్ట్‌- రామాంజ‌నేయులు, ఎడిట‌ర్- చోటా.కె.ప్రసాద్‌, సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌, మాట‌లు- అబ్బూరి ర‌వి, డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌, నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌, స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్టర్‌- వి.ఐ.ఆనంద్‌.

English summary
The first look of Nikhil's 'Ekkadiki Pothavu Chinnavaada' is here. The movie is directed by VI Anand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu