»   » నిఖిల్ ని డైరక్ట్ చేయాలని ఉందా...ఇదిగో సూపర్ ఆఫర్

నిఖిల్ ని డైరక్ట్ చేయాలని ఉందా...ఇదిగో సూపర్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :‘స్వామి రారా', ‘కార్తికేయ', ‘సూర్య వెర్శస్ సూర్య' వంటి విభిన్న కాన్సెప్టులతో విజయాన్ని అందుకుని రొటీన్ కు మంగళం పాడిన నిఖిల్...తన స్క్రిప్టుల ఎంపికలోనూ కొత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనతో పనిచేయాలని ఉత్సాహపడుతున్న కుర్రాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాడు. ఆయన్ని డైరక్ట్ చేయాలి,కథ చెప్పాలి అనుకునే వాళ్లు ఇదిగో ఈ క్రింద మ్యాటర్ చదివి పనిలో దిగిపోవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాకు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా చాలా మెసేజ్ లు మా స్క్రిప్టు వినండి, నా షార్ట్ పిల్మ్ చూడండి అంటూ వస్తున్నాయి. వాటిలో కొన్ని నేను మిస్ కూడా అవుతున్నాను.

‘ఇండస్ట్రీలో అవకాశాలు లేక చాలా మంది టాలెంట్ ఉన్నా బయటే ఉన్నారు అనే విషయాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. వాళ్ళకి నేను సాదరంగా వెల్కమ్ చెబుతున్నాను. మీరు మీ ఐడియాలని, కథలని నాకు చెప్పండి. నా టీం మీ స్క్రిప్ట్స్ కోసం వేచి చూస్తోంది.

Scripts.nikhil@gmail.com అనే మెయిల్ ఐడికి మీ షార్ట్ ఫిల్మ్స్, మీ స్టొరీ ఐడియాస్, వీడియోస్, వన్ లైన్ స్టోరీస్ ని మెయిల్ చేయండని' నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

ప్రస్తుతం నిఖిల్ తన తాజా చిత్రం ‘శంకరాభరణం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఇటీవలే నిఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేసారు.

Nikil’s invitation to aspiring filmmakers

‘శంకరాభరణం' కి కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈమధ్యే మొదలైంది. షూటింగ్ మొదలైన రోజే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన యువకుడిగా నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం.

క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు కోనవెంకట్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో అతిధి పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటిస్తోందని కోన తెలిపారు.

English summary
Nikhil tweeted, “I really do believe there is so much talent out there nd i welcome them to come tel me their ideas nd scripts. My team will be waiting for u . Scripts.nikhilgmail.com is the email id to which u can mail me ur short films,story ideas, Videos, synopsis, One lines etc.. So BRING IT ON .”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu