twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుళ్లో ఏముంది? ('కార్తికేయ' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ''ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి కథలు ఎంచుకొంటున్నా. నాకు నచ్చే కథల కంటే ప్రేక్షకుల్ని మెప్పించే కథల్లోనే నటిస్తుంటా. 'యువత' తర్వాత ఆ తరహాలో సాగే కథల్నే ఎంచుకొన్నా. వాటి ఫలితం కలసి రాలేదు. అందుకే అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా కథ ఏం కోరుకొంటే అది ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా'' అంటూ వస్తున్నాడు నిఖిల్. స్వామిరారా చిత్రంతో హిట్ కొట్టిన నిఖిల్ ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

    ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. ఇందులో నిఖిల్ పాత్ర పేరు కార్తీక్‌. ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌గా కనిపిస్తాడు. ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి ఏంతదూరమైనా వెళ్లే పాత్ర నాది. ఫలానా బూత్‌ బంగ్లాలో దెయ్యం ఉందట కదా! అని ఎవరైనా అంటే అది నలుగురి ద్వారా వేగంగా దూసుకుపోతుంది. ఆ తర్వాత అటువైపు చూడాలంటే భయపడతారు. కానీ పదిమందిలో ఒక్కడు మాత్రం అక్కడ ఏముందో చూడాలనుకుంటాడు. అలాంటి పాత్రలో నిఖిల్ ది. అలాంటి కార్తీక్...ఒకానొక టైమ్ లో... ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లోని సుబ్రహ్మణ్యపురం అనే ఊళ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉన్న కార్తికేయుని గుడి చుట్టూ ఈ కథ నడుస్తుంది. అక్కడున్న ఓ మిస్టరీని కార్తీక్ ఎలా సాల్వ్ చేసాడన్నదే థ్రిల్లింగ్ నడిచే కథనం. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం. స్వామిరారా చిత్రం వినాయకుడు చుట్టూ నడిస్తే.. ఈ చిత్రంలోనూ కథ అంతా సుబ్రమణ్యేశ్వర స్వామి చుట్టూ తిరుగుతుంది.

    నిఖిల్ మాట్లాడుతూ...''కొన్ని అనుకొని చేస్తాం, కొన్ని అనుకోకుండానే జరిగిపోతుంటాయి. ఇదివరకటి 'స్వామి రా రా' చిత్రం వినాయకుడి విగ్రహం చుట్టూ సాగుతుంది. 'కార్తికేయ' సుబ్రహ్మణ్యస్వామి గుడి చుట్టూ సాగుతుంది. ఆ ఇద్దరు దేవుళ్లు అన్నదమ్ములు కావడం, ఇందులోనూ నేనూ, స్వాతి కలసి నటించడం, ఎప్పుడో ఆగస్టులో విడుదల కావల్సిన ఈ సినిమా అక్టోబరు 24న అదీ కార్తీక మాసం ఆరంభం రోజున విడుదలవుతుండడం, ఈ సినిమా కోసం ఐదుగురు కార్తీక్‌లు కలసి పనిచేయడం ఇవన్నీ తలచుకొంటే గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. మా సినిమాలో దేవుడా సైన్సా? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. నేను మాత్రం దేవుడినే నమ్ముతాను'' అన్నారు.

    Nikil's latest movie Karthikeya preivew

    బ్యానర్: 'మాగ్నస్ సినీ ప్రైమ్'
    నటీనటులు: నిఖిల్, స్వాతి, తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు
    కెమెరా : కార్తిక్,
    సంగీతం : శేఖర్ చంద్ర,
    ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్,
    ఆర్ట్ : సాహి సురేష్,
    పాటలు : కృష్ణ చైతన్య,
    కొరియోగ్రఫీ : రఘు,
    ఫైట్స్ : వెంకట్ నాగు,
    సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ,
    నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం,
    కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

    English summary
    Karthikeya movie is touted to be as the thriller like the previous movie of Nikhil, Swamy Ra Ra. This movie is directed by debutante director named as Chandoo Mondeti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X