»   » కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు మరో పెద్ద ఛాన్స్

కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు మరో పెద్ద ఛాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ సందేశ్ 'ఏమైంది ఈ వేళ' చిత్రంతో పరిచయమైన కాజల్ చెల్లెల్ నిషా అగర్వాల్ మరో చిత్రం పట్టింది. ఎస్వీకే సినిమా సంస్థ నారా రోహిత్‌తో నిర్మిస్తున్న చిత్రం 'సోలో'లో హీరోయిన్ గా ఆమెను సెలెక్టు చేసారు. ఈ చిత్రంలో నాయికగా నిషా అగర్వాల్‌ ఎంపికైంది. 'సోలో' చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. పరుశరామ్ గతంలో యువత,ఆంజనేయులు చిత్రాలు డైరక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని గురించి చెబుతూ..'' రీసెంట్ గానే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఈ నెల 12 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఓ కమర్షియల్ చిత్రానికి కావల్సిన సకల హంగులూ ఉన్న కథ ఇది. విశాఖపట్నం పరిసరాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాము అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ...బాణం సినిమా తరువాత మంచి కధ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పరుశురామ్ గారు మంచి కధ చెప్పారు.ఈ సినిమా తో మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నాను అన్నారు. ప్రకాష్‌ రాజ్, షాయాజీ షిండే, జయసుధ, సుమలత, ఎం.ఎస్.నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).

English summary
Kajal Agarwal's sister Nisha Agarwal has signed her second film. She will be romancing Nara Rohith for the movie titled Solo, being directed by Parusharam. Nisha Agarwal made debut in Emaindi Ee Vela. Solo will have its regular shoot from March 12 in Vizag.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu