»   »  'కాటమరాయుడు' ట్వీట్ : క్షమించమన్న నితిన్,స్పందించిన రామ్ చరణ్

'కాటమరాయుడు' ట్వీట్ : క్షమించమన్న నితిన్,స్పందించిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాటమ రాయుడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ చూసిన పవన్ ఫ్యాన్స్ సినిమా సూపర్ హిట్ అని ఫిక్సవుతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ సృష్టిస్తున్న సునామీ అంతాఇంతా కాదు.

చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా టీజర్ విడుదల చేసిన మూడు గంటల్లో వన్ మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సాధించింది. కానీ పవన్ కాటమరాయుడు ఈ రికార్డ్‌ను యూట్యూబ్‌లో టీజర్ అప్‌లోడ్ చేసిన 2 గంటల్లోనే సాధించడం విశేషం. అయితే ఈ విషయంలో పవన్ వీరాభిమాని..ఓ వివాదం లో ఇరుక్కున్నారు.

Nithiin apologizes for his Katama Rayudu tweet

వివరాల్లోకి వెళితే...పవన్ కల్యాణ్‌కు నితిన్ ఎంత వీరాభిమానో తెలిసిందే. టీజర్‌ విడుదలైన కొద్ది సేపటికే హీరో నితిన్ కూడా స్పందించాడు. ఇప్పటిదాకా ఎంత మంది రాయుడులు వచ్చినా.. కాటమరాయుడు ముందు దిగదుడుపేనంటూ సినిమా టీజర్ లింక్‌ను ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై మోహన్‌బాబు అభిమానులు బాగా హర్టయ్యారు.

నితిన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఆ పోస్ట్‌ను తీసేసి క్షమాపణలు చెప్పాడు నితిన్. తాను ఏ గొప్ప స్టార్‌ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన ట్వీట్ వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరాడు. నితిన్ క్షమాపణల ట్వీట్‌పై అటు మంచు లక్ష్మి కూడా స్పందించిందట. క్షమాపణలు అంగీకరిస్తున్నామని, ఇంకెప్పుడు అలా చేయొద్దని నితిన్‌కు ప్రతి ట్వీట్ చేసిందట.

Nithiin apologizes for his Katama Rayudu tweet

మంచు లక్ష్మి కూడా తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేసిందని సమాచారం. దీంతో మంచు లక్ష్మి స్వయంగా నితిన్‌కు ఫోన్ చేసి ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ...ఈ టీజర్‌ను చూసిన మెగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించాడు. టీజర్ సూపర్ అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మెగా అభిమానులంతా ఆనందపడ్డారు.

English summary
Nithin apologized saying ““I did not want 2 hurt any 1 in the industry or out..I m extremely sorry if i hurt the feelings of fans n followers of other great artists.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu