»   » పెళ్లి కాలేదు మొర్రో.. అదంతా అబద్ధం.. నితిన్ పెళ్లిసందడి రచ్చ రచ్చ..

పెళ్లి కాలేదు మొర్రో.. అదంతా అబద్ధం.. నితిన్ పెళ్లిసందడి రచ్చ రచ్చ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరో నితిన్ తన పెళ్లి వార్తలపై క్లారిటి ఇచ్చేశాడు. గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో నితిన్ పెళ్లి జరిగిందంటూ ఓ ఫోటో వైరల్‌గా మారింది. దాంతో నితిన్ తన పెళ్లికి సంబంధించిన వార్త గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో రాశీఖన్నాతో కలిసి శ్రీనివాస కళ్యాణం అనే చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.

 నితిన్ రాశీఖన్నాలపై

నితిన్ రాశీఖన్నాలపై

శ్రీనివాస కళ్యాణం షూటింగ్‌లో భాగంగా నితిన్, రాశీఖన్నాపై పెళ్లి సీన్‌ను చిత్రీకరించారు. పెళ్లిపీటల మీద నూతన దంపతులుగా కనిపించిన రాశీఖన్నా, నితిన్ ఫొటోలను రిలీజ్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

 నితిన్ ఫోటోను కట్ చేసి

నితిన్ ఫోటోను కట్ చేసి

పెళ్లి ఫోటోల నుంచి నితిన్‌ను మాత్రమే కట్ చేసి వాటిని యూట్యూబ్‌లో సెన్సేషన్ చేశారు. నితిన్ పెళ్లైంది. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు అని హెడ్డింగ్ పెట్టి పబ్లిష్ చేశారు.

 నా జర్నీ ప్రారంభమైంది

నా జర్నీ ప్రారంభమైంది

దాంతో సోష‌ల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. వీటికి తోడు ట్విట్టర్‌లో నా జర్నీ ప్రారంభమైంది అంటూ ట్వీట్ చేయడం ఆ వార్తకు మరింత బలం చేకూరింది.

 దిల్ రాజు నిర్మాతగా

దిల్ రాజు నిర్మాతగా

శ్రీనివాస కల్యాణం సినిమా ప్రారంభమైంది. చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు అని నితిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటించడం గమనార్హం.

 సతీష్ వెగ్నేష దర్శకత్వంలో

సతీష్ వెగ్నేష దర్శకత్వంలో

శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేశ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌తో రాశీఖన్నా జోడికట్టింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

English summary
Nithiin condemns marriage rumours social media account. He tries to put to rest unnecessary speculations. As images of actor Nithiin in a wedding attire started making rounds on the social media,the actor was quick to clarify that the pictures were from his upcoming film 'Srinivasa Kalyanam'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu