»   »  అతడితో విభేదాలు అందుకే, పుల్లలు పెట్టారు.. ఇప్పుడు అంతా ఓకే.. నితిన్ వ్యాఖ్య!

అతడితో విభేదాలు అందుకే, పుల్లలు పెట్టారు.. ఇప్పుడు అంతా ఓకే.. నితిన్ వ్యాఖ్య!

Subscribe to Filmibeat Telugu

నితిన్ నటించిన తాజాగా చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. యావరేజ్ టాక్ తో ఈ చిత్రం రన్ అవుతోంది. నితిన్ కు ఇది 25 వ చిత్రం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. మేఘా ఆకాష్ తో కలసి నితిన్ నటించిన రెండవ చిత్రం ఇది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో నితిన్ బిజీగా గడుపుతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని లిరిసిస్ట్ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.

తాజగా ఇంటర్వ్యూలో నితిన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్ దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్నాడు. 2003 లో వచ్చిన దిల్ చిత్రం నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తిరిగి వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. నితిన్, దిల్ రాజు మధ్య విభేదాలు ఉన్నాయంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నితిన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. తనకు దిల్ రాజుతో ఎప్పుడూ విభేదాలు లేవని అన్నారు. కానీ మధ్యలో కొందరు వ్యక్తులు పుల్లలు పెట్టడం వలన సమస్యలు తలెత్తినట్లు నితిన్ తెలిపాడు.

Nithiin reveals shocking conflicts with producer Dil Raju

ఇప్పుడు విభేదాలన్నీ సమసిపోయాని, తామే నేరుగా మాట్లాడుకుంటున్నాం అని నితిన్ అన్నాడు. తాము ఎప్పుడు కుటుంబం లాగే ఉంటామని నితిన్ తెలిపాడు. గత రెండు మూడేళ్ళుగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికి కుదిరిందని అన్నారు. నితిన్ వరుసగా రెండు చిత్రాలు దిల్ రాజు నిర్మాణంలో నటించబోతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలు దిల్ రాజు నిర్మాణంలోనివే.

English summary
Nithiin reveals shocking conflicts with producer Dil Raju. Nithin acting next two film under Dil Raju production
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X