నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ యూఎస్ఏ రిలీజ్ ‘ఛల్ మోహన్ రంగ’
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛల్ మోహన్ రంగ' చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూఎస్ఏలో ఏప్రిల్ 4న ప్రీమియర్ షోల ద్వారా సాయంత్ర 6 గంటలకు విడుదల కాబోతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం 130కి పైగా లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు.
నితిన్ కెరీర్లోనే యూఎస్ఏలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న చిత్రంగా 'ఛల్ మోహన్ రంగ' నిలిచింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్టు అందించడం, పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ నటిస్తుండగా, నరేష్, ప్రగతి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇటీవల విడుదలైన 'ఛల్ మోహన్ రంగ' ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 5 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. తమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు సినిమాకు హైలెట్ కానుంది.


Click it and Unblock the Notifications











