»   » ఛల్ మోహన్ రంగ :పవన్ వదిలిన టీజర్ అదిరిందిగా..నితిన్, మేఘా వెదర్ రిపోర్టర్సా..!

ఛల్ మోహన్ రంగ :పవన్ వదిలిన టీజర్ అదిరిందిగా..నితిన్, మేఘా వెదర్ రిపోర్టర్సా..!

Subscribe to Filmibeat Telugu
ఛల్ మోహన్ రంగ :పవన్ వదిలిన టీజర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో లవర్ బాయ్ నితిన్ నటిస్తున్న చిత్రం ఛల్ మోహన్ రంగ. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ని విడుదుల చేసారు. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నితిన్ డైలాగ్స్ తో టీజర్ అదింరింది. ప్రేమికుల రోజు ఫర్ఫెక్ట్ టీజర్ అని చెప్పొచ్చు.

టీజర్ ఎలా ఉందంటే

ఓ వ్యక్తికి నితిన్ తన ప్రేమ కథని మూడు ముక్కలో వివరించడమే ఈ టీజర్. నీ స్టోరీ ఏంటి బయ్యా అని నితిన్ ని ఓ వ్యక్తి అడుగుతాడు. 'మేమిద్దరం వర్షా కాలంలో కలుసుకున్నాం.. శీతాకాలంలో ప్రేమించుకున్నాం. వేసవి కాలంలో విడిపోయాం' అని నితిన్ అంటాడు. మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా బయ్యా అంటూ అవతలి వ్యక్తి అనడం మంచి హాస్యాన్ని కలిగిస్తోంది.

40 సెకండ్లలో మూడు ముక్కల్లో.. అద్భుతంగా

40 సెకండ్లలో మూడు ముక్కల్లో.. అద్భుతంగా

దాదాపు 40 సెకండ్ల నిడివి గల ఈ టీజర్లో నితిన్ తన లవ్ స్టోరీ ని మూడు ముక్కల్లో తేల్చేశాడు. టీజర్ అద్భుతంగా ఉందంటూ అప్పుడే కాంప్లిమెంట్స్ పడిపోతున్నాయి.


టీజర్ విడుదల చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఫీషియల్ సినిమా ట్విట్టర్ అకౌంట్ పీకే క్రియేటివ్ వర్క్స్ ద్వారా ఛల్ మోహన్ రంగ టీజర్ ని కొద్ది సేపటిక్రితమే విడుదల చేశారు.


పవన్ కళ్యాణ్ నిర్మాణంలో

పవన్ కళ్యాణ్ నిర్మాణంలో

శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్క్ మరియు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.


మాటల మాంత్రికుడి కథ, కృష్ణ చైతన్య దర్శకత్వం

మాటల మాంత్రికుడి కథ, కృష్ణ చైతన్య దర్శకత్వం

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథని అందిస్తున్నారు. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. కృష్ణ చైతన్య ఇదివరకే దర్శకత్వం వచ్చిన రౌడీ ఫెలో చిత్రానికి ప్రశంసలు దక్కాయి. సంగీతం థమన్

సంగీతం థమన్

వరుస హిట్లు కొడుతున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉంది.


 వేసవిలో విడుదల

వేసవిలో విడుదల

ఇప్పటికే వేసవి బరిలో భారీ చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చ్ 30 న రాంచరణ్ రంగస్థలం, ఏప్రిల్ 26 న మహేష్ భరత్ అనే నేను, 27 న అల్లు అర్జున్ నాపేరు సూర్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 5 న ఛల్ మోహన్ రంగ చిత్రం రాబోతోంది.


English summary
Nithiin's Chal Mohan Ranga teaser released. Krishna Chaitanya is director of the movie and Pawan Kalyan and trivirkam producing it. Megha Aakash is female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu