»   » నిరాశ నుంచి తేరుకుని హుషారుగా నితిన్!

నిరాశ నుంచి తేరుకుని హుషారుగా నితిన్!

Subscribe to Filmibeat Telugu

హీరో నితిన్ సినీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ఇష్క్ ముందు ఆ తరువాత అని చెప్పొచ్చు. ఇష్క్ చిత్రం వరకు నితిన్ దాదాపు పదేళ్ల పాటు విజయానికి దూరంగా ఉన్నాడు. ఇష్క్ చిత్రం అందించిన సంతోషంతో ఈ హీరోలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇష్క్ చిత్రం తరువాత కూడా నితిన్ కు పరాజయాలు ఎదురయ్యాయి. కానీ నితిన్ ని కుంగదీసేంత పరాజయాలైతే కాదు.

నితిన్ చివరి చిత్రం ఛల్ మోహన్ రంగ చిత్రం ఇటీవల విడుదలయింది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంది. కానీ ఛల్ మోహన్ రంగ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఛల్ మోహన్ రంగ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ నిరాశ నుంచి నితిన్ త్వరగానే బయట పడ్డాడు. నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

Nithin is busy with acting in Srinivasa Kalyanam movie.

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్ నటిస్తున్న చిత్రం ఇది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని దర్శకుడు. ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ఛత్తీస్ ఘడ్ లో ప్రారంభమైంది. కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నారు. నితిన్ మరియు ఇతర చిత్ర యూనిట్ తో దిల్ రాజు దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది.

English summary
Nithin movie new schedule starts. Nithin is busy with acting in Srinivasa Kalyanam movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X