»   » నితిన్‌-కరుణాకరన్‌ చిత్రం ప్రారంభోత్సవం (ఫోటోలు)

నితిన్‌-కరుణాకరన్‌ చిత్రం ప్రారంభోత్సవం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్‌ హీరో నితిన్ కథానాయకుడిగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు ప్రారంభమయింది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్
సమర్పకులు. నితిన సరసన బాలీవుడ్‌ కథానాయిక మిస్తీ జోడి కడుతోంది.

ముహూర్తపు షార్ట్‌కు నిర్మాత రామ్ మోహన్ రావు క్లాప్ నివ్వగా..సదానంద్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ..జూన్ 2 న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంబి౦చుకునే ఈ సినిమా
ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుందని తెలిపారు.

శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన ఇష్క్, గుండేజారి గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మక వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి:ఆండ్రూ,ఆర్ట్ రాజీవ్ నాయర్ ,సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

నితిన్, మిస్తీ

నితిన్, మిస్తీ


సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా ముహూర్తపు సన్నివేశం షూటింగులో పాల్గొన్న హీరో నితిన్, మిస్తీ

పూజా కార్యక్రమాలు

పూజా కార్యక్రమాలు


సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా స్క్రిప్టు ప్రతులతో పూజా కార్యక్రమం నిర్వహిచారు.

వివి వినాయక్ గౌరవ దర్శకత్వం

వివి వినాయక్ గౌరవ దర్శకత్వం


ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

హీరో, దర్శకుడు హీరోయిన్

హీరో, దర్శకుడు హీరోయిన్


సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా హీరో నితిన్, దర్శకుడు కరుణాకరన్, హీరోయిన్ మిస్తీ

English summary

 Nithin-Karunakaran movie launched today Hyderabad. The movie shooting is likely to commence in June 2, 2014. Shresth Movies will produce the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu