»   »  మళ్ళీ పవన్ మీద అభిమానాన్ని చాటుకున్నాడు: "తమ్ముడు" లుంగీలో నితిన్

మళ్ళీ పవన్ మీద అభిమానాన్ని చాటుకున్నాడు: "తమ్ముడు" లుంగీలో నితిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వయ్యారి భామా నీ హంసనడకా...! ఈ సాంగ్ గుర్తుందా..?? అప్ప్ట్లో హీరోతో పాటు ఫారిన్ అబ్బాయిలు గ్రూప్ డాన్సర్లుగా చెయ్యటం ఒక ఎత్తయితే మాస్ తరహా లుంగీ, తలకు పాగా లా చుట్టిన కర్చీఫ్, నోట్లో బీడీ తో ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించాడు పవన్. అప్పటి యూత్ కి అదో క్రేజీ గెటప్ అయ్యింది... అయితే ఇప్పుడు మళ్ళీ ఆ గెటప్ లోనే కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు పవన్ వీరాభిమాని నితిన్

పవన్ కల్యాణ్ పాట

పవన్ కల్యాణ్ పాట

ఇక్కడ నితిన్ గెటప్ చూడండి మీకే అర్ధం అవుతుంది పవన్ మీద అభిమానాన్ని ఎంతగా చూపించాడో. అసలే మనోడు పవన్ కళ్యాణ్ కి భీబత్సమైన ఫ్యాన్. గతం లో కూడా పవన్ పాటలో లైన్ నే టైటిల్గా గుండెజారి గల్లంతయ్యిందే లోకూడా తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ పాటను రీమేక్ చేశాడు.

నితిన్ అభిమానం

నితిన్ అభిమానం

మక్కీకి మక్కీ పవన్ ని ఇమిటేట్ చేస్తూ తన అభిమాన హీరోకి ఒక ట్రైబ్యూట్ గా ఆ పాటని అంకితం చేసినంత పని చేసాడు. అప్పుడే అర్ధమైంది నితిన్ అభిమానం పవన్ మీద ఏ స్థాయిలో ఉందో. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా కూడా మనోడు పవన్ 'తమ్ముడు' సినిమాలో వేసిన "వయ్యారి భామ" సాంగ్ లో కనిపించే గెటప్ తో కనిపించాడు.

పవన్ సినిమా అన్నంత ప్రేమతో

పవన్ సినిమా అన్నంత ప్రేమతో

ఈ పోస్టర్ తో మాస్ ప్రేక్షకులు అలరిచడానికి సినిమాకు మరో కొత్త కోణం ఇవ్వడానికి ఉపయోగపడింది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ తమ సినిమానే అన్నంతగా లై ప్రమోషన్ చేసేస్తున్నారు. పవన్ సినిమా అన్నంత ప్రేమతో నితిన్ కూడా ఓన్ చేసుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ పేజీల్లోకూడా లై పోస్టర్లు కనిపిస్తున్నాయి.

మేఘా ఆకాష్

మేఘా ఆకాష్

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా లవ్ తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ లుక్ కనిపించే తీరుబట్టి తెలుస్తుంది. ఈ షూటింగ్ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. 14 రీల్స్ బేనర్ వాళ్ళు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

English summary
Nithin wears a lungi as Pawan Kalyan in "Vayyari bhaamaa nee hamsa naDaka" the very populer song frome the movie "Tammudu"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu