twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ ‘అఆ’ ఆడియో రిలీజైంది, ఎలా ఉంది? వినొచ్చా (‘అఆ’ ఆడియో రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ :నితిన్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'అఆ' . అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్యభూమిక పోషించారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు.

    సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'అఆ' ఆడియో పంక్షన్ లో చిత్రం ఆడియో సాంగ్స్ విడుదల అయ్యాయి. మొదటి సారిగా మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...ఫీల్ గుడ్ పాటలు అందించే మిక్కీ జే మేయర్ చేత తన చిత్రం ఆడియో చేయించుకున్నారు.

    పూర్తి పాటలు ఇక్కడ నుంచి వినండి...

    ఈ పాటలు మ్యూజిక్ లవర్స్ కు బాగా నచ్చుతున్నాయి. ఐదు మెలోడియస్ సాంగ్స్ ని మిక్కీ అందిస్తే ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణచైతన్యలు పాటలకు సాహిత్యం అందించగా, చిత్ర, కార్తిక్‌, శ్రావణ భార్గవి, అంజనసౌమ్య, రమ్య, సాయి శివాని, రాహుల్‌ నంబియార్‌, అభరు జోద్‌ పుర్‌ కర్‌లు గీతాలను ఆలపించారు. ఆదిత్యా వారు ఫ్యాన్సీ రేటుకు ఈ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మరి ఈ పాటలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా

    యా...యా

    యా...యా

    సింగర్:అభరు జోద్‌ పుర్‌ కర్‌, చిత్ర, శివ శివాని, అంజనా సౌమ్య
    లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

    ఈ పాట విన్న వెంటనే కనెక్ట్ అవుతుంది. మిక్కీ జే మేయర్....ఫోన్ ట్యూన్ తీసుకుని, క్లాసికల్ బీట్స్ కలిపారు. రామ జోగయ్య శాస్త్రి ఈ ట్యూన్స్ కు మరింత అందంగా , మంచి ఎక్సప్రెషన్స్ తో నింపేసారు. మ్యూజిక్ లవర్స్ కు ఫెరఫెక్ట్ సాంగ్.

    రంగ్ దే...

    రంగ్ దే...

    సింగర్: రమ్య బెహరా, శివ శివాని, రాహుల్ నంబియార్
    లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

    ఇదో బ్యూటిఫుల్ మెలోడి. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. మ్యాజికల్ ట్యూన్ కు అందమైన పదాలు పడ్డాయి. తమ మధురమైన గొంతుతో సింగర్స్ మరింత మెరుగులు దిద్దారు. పాటలో ఇంద్రధనుస్సని చూసిన అనుభూతి కలుగుతుంది.

    అనసూయ కోసం...

    అనసూయ కోసం...

    సింగర్: కార్తీక్
    లిరిక్స్: కృష్ణ చైతన్య

    కార్తీక్ ఈ సాంగ్ ని అద్బుతంగా పాడారు. పెప్పీగా, ఎనర్జీగా సాగుతుంది ఈ పాట. కృష్ణ చెతన్య రాసిన లిరిక్స్ చాలా ప్లీజింగ్ గా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ కు ఇది కూడా బాగా నచ్చుతుంది.

    మమ్మీ రిటర్స్

    మమ్మీ రిటర్స్

    సింగర్: శ్రావణ భార్గవి
    లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

    ఈ పాట హిలేరియస్ గా సాగుతుంది కానీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. శ్రావణ భార్గవి ఫెంటాస్టిక్ జాబ్ చేసింది. హస్కీ నంబర్. చాలా గమ్ముత్తుగా చేసారీ పాటను. రామ జోగయ్య శాస్త్రి కూడా చాలా ఇంప్రెసివ్ గా తన ముద్ర వేసారు. మిక్కీ జే మేయర్ కూడా అదరకొట్టారు.

    యెల్లి పోకే శ్యామల

    యెల్లి పోకే శ్యామల

    సింగర్: కార్తీక్
    లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి

    ఇదో మెలోడియస్ ప్లోక్ ట్యూన్. చాలా బాగుంది. లిరిక్స్ కూడా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. కార్తీక్ ఎప్పటిలాగే రాక్. చాలా ఫ్రెష్ గా ఉన్న ఈ పాట మెల్లిగా ఎక్కుతుంది. కానీ చాలా కాలం నిలిచిపోతుందనిపిస్తుంది.

    ఎనాలసిస్

    ఎనాలసిస్

    మిక్కీ జే మేయిర్ నుంచి వచ్చిన బ్రిలియెంట్ ఆల్బమ్ అని చెప్పాలి. దాదాపు అన్ని పాటలన్ని మెలోడియస్ గా సాగాయి. రిలీజయ్యి ఇరవై నాలుగు గంటలు కాక ముందే యూట్యూబ్ లో పాటలు చాలా ఎక్కువ మంది వినటం జరిగింది.

    English summary
    A Aa is the most awaited albums this season which stars Nithiin, Samantha and Anupama Parameshwaran in lead roles. For the first time, Maatala Mantrikudu Trivikram Srinivas has teamed up with the feel good composer Mickey J Meyer. Here is audio review of the album
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X