For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్‌ 'చిన్నదాన నీ కోసం' ఆడియో వేడుక విశేషాలు (ఫొటోలతో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: కరుణాకరన్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'చిన్న దాన నీకోసం'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గురువారం జరిగింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.

  ఈ ఆడియో విడుదల సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్, నితిన్ కలిసిన చిత్ర పటాన్ని నితిన్ కు బహుకరించారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని చాటారు. పవన్ ఫొటో ఎక్కడ పెట్టుకుంటారని అడగగా...తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు.

  శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖిత రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

  స్లైడ్ షో లో ఆడియో ఆవిష్కరణ

  ఆవిష్కరణ...

  ఆవిష్కరణ...

  బిగ్ సీడి, ఆడియో సీడిలను వివి వినాయిక్ ఆవిష్కరించారు.

  తొలి సీడిని

  తొలి సీడిని

  తొలి సీడిని ఏషియన్ ధియోటర్స్ అథినేత నారాయణ్ దాస్ నారంగ్ అందుకున్నారు.

  నాగార్జున మాట్లాడుతూ...

  నాగార్జున మాట్లాడుతూ...

  నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డిగారు, మేం చాలా క్లోజ్ ప్రెండ్స్ ముందుగా ఆయనకు ధాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా దగ్గరకి విక్రమ్ అనే దర్శకుడుని పంపారు. మనం సినిమాని ఇచ్చారు. ఆయన రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. ఈ సినిమా తొలి ప్రేమ కంటే పెద్ద హిట్ కావాలి. కరుణా కరన్, నితిన్ మిగతా టెక్నీషియన్స్ కి ఆల్ ది బెస్ట్. సుధాకర్ రెడ్డి గారు, నేను త్వరలోనే ఓ ప్రాజెక్టుతో కలవబోతున్నా్ం. ఆ వివరాలు త్వరలోనే తెలియచేస్తాం అన్నారు.

  నితిన్ మాట్లాడుతూ...

  నితిన్ మాట్లాడుతూ...

  నేను తొలి ప్రేమ సినిమా చూసి సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. కరుణాకరన్ గారితో పనిచేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నా ఫెరఫార్మెన్స్ డిఫెరెంట్ గా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సినిమా కరుణాకరన్ గారి స్టయిల్ యూత్ ఫుల్ లవ్ స్టోరి. అనూప్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తే కృష్ణ చైతన్య దానికి తగిన విధంగా లిరిక్స్ రాసారు. టీమ్ అందరికీ థాంక్స్ అన్నారు.

  వివి వినాయిక్ మాట్లాడుతూ...

  వివి వినాయిక్ మాట్లాడుతూ...

  సుధాకర్ రెడ్డి గారికి, నాకు దిల్ సినిమా నుంచీ మంచి అనుబంధం ఉంది. నితిన్ జయం సినిమా టైమ్ లో యాడ్ చూసి తనతో దిల్ సినిమా చేసాను. తన కష్టంతో ఇక్కడకి వచ్చాడు. ఇంకా తను ఎదగాలి. అనూప్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్సే, కరుణాకరన్ గారికి తొలి ప్రేమ నుంచీ మేమందరం ఫ్యాన్స్. మాకందరికీ ఇష్టమైన దర్శకుడు అన్నారు.

  నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ...

  నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ...

  మా బ్యానర్ లో ఇష్క్ ,గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు రెండు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ సినిమాతో హాట్రిక్ ఖాయం. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్నారు.

  అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...

  అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...

  సాంగ్స్ బాగా వచ్చాయి. ఆడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ సూపర్ గా ఉంది. కరుణాకరన్ గారు సినిమాని సూపర్ గా డైరక్ట్ చేసారు అన్నారు.

  మనం దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...

  మనం దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...

  యూనిట్ కు గుడ్ లక్. సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలి అన్నారు.

  దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ...

  దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ...

  పవన్ అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేసారు. ఇప్పుడు తమ్ముడు నితిన్ తో ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చే లవ్ స్టోరీ అవుతుంది అన్నారు.

  నందినీ రెడ్డి మాట్లాడుతూ...

  నందినీ రెడ్డి మాట్లాడుతూ...

  నేను కరుణాకరన్ గారికి పెద్ద ప్యాన్ ని. నేను ఇండస్ట్రీలోకి రావటానికి ఆయన కూడా ఒక కారణం. సినిమా టైటిల్ లోనే మ్యూజిక్ ఉంది. డాషింగ్ హీరో నితిన్ కి మరో హ్యూజ్ హిట్ అవుతుంది. మిస్తి అంటే స్వీట్. ఈ సినిమాలో చాలా స్వీట్ గా యాక్ట్ చేసింది అన్నారామె.

  అలీ మాట్లాడుతూ...

  అలీ మాట్లాడుతూ...

  వరస విజయాలు సాధిస్తున్న నితిన్ ఈసినిమాతో మరో సక్సెస్ ను కొడతాడు. చాలా కష్టపడే తత్వం ఉన్న హీరో. కరుణాకరన్ తో తొలి ప్రేమ చేసాను.మంచి హైపర్ ఉన్న దర్శకుడు. సీన్ ను కరెక్టు చేయించుకోగలుగుతాడు. తమిళంలో భారతీరాజాగారిలా కరుణాకరన్ తెలుగులో గొప్ప దర్శకుడు. ఆయన చేస్తున్న తొమ్మిదో సినిమా. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.

  కొండా విజయకుమార్ మాట్లాడుతూ...

  కొండా విజయకుమార్ మాట్లాడుతూ...

  శ్రేష్ట్ మూవిస్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు లైఫ్ ఇచ్చిన బ్యానర్. ఇఫ్పుడు నితిన్ కు ప్రేమ కథల స్పెషలిస్టు కరుణాకరన్ జత కలిసారు. అంటే సినిమా ఎంత బావుంటుందో అర్దం చేసుకోండి అన్నారు.

  గుత్తా జ్వాల మాట్లాడుతూ...

  గుత్తా జ్వాల మాట్లాడుతూ...

  నితన్ బాగా చేసుంటాడు. నిఖితా కు ఆల్ ది బెస్ట్. సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారామె.

  ముకుంద్ పాండే మాట్లాడుతూ...

  ముకుంద్ పాండే మాట్లాడుతూ...

  ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం నితిన్ గారే..ఆయనకీ, టీమ్ కూ ఆల్ ది బెస్ట్ అన్నారు.

  దిల్ రాజు మాట్లాడుతూ...

  దిల్ రాజు మాట్లాడుతూ...

  తొలి ప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కే కాకుండా నాకు, సుధాకర్ రెడ్డి గారికీ టర్నింగ్ పాయింట్. నితిన్ చేసిన దిల్ సినిమానే నా ఇంటిపేరు అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ అద్బుతం. తను రైట్ ట్రాక్ లో ఉన్నాడు అన్నారు.

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...

  నితిన్ హోమ్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా నితిన్ బ్యానర్ లో సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ టీమ్ అన్నారు.

  ఈ కార్యక్రమంలో....

  ఈ కార్యక్రమంలో....

  చిత్ర బృందంతో పాటు దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాతలు దిల్‌రాజు, బెల్లంకొండ సురేష్‌, రచయిత హర్షవర్దన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

  English summary
  Nitin's latest 'Chinnadana Neekosam' movie audio released. 'Chinnadana Neekosam' film starring Nithin and Mishti Chakraborty seems to be Karunakaran-mark Entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X