»   » నితిన్ ‘అఆ’ట్రైలర్ టాక్: టిపికల్ త్రివిక్రమ్ సినిమా

నితిన్ ‘అఆ’ట్రైలర్ టాక్: టిపికల్ త్రివిక్రమ్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'అఆ'. అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్యభూమిక పోషించారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో నిన్న రాత్రి రిలీజైంది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూసినవారు త్రివిక్రమ్ పంచ్ లు, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో అలరించిందని అంటున్నారు. ఆ ట్రైలర్ మీరు చూసి చెప్పింది.

Nitin, Trivikram's A..Aa's Trailer

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ....''ఈ సినిమాకి 'అఆ' అనే పేరు ఎందుకు పెట్టారని ఎవరో అడిగితే మళ్లీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర్నుంచి జీవితం మొదలు పెట్టాలనిపించింది అని చెప్పా. పనిచేయడంలోనూ, గెలవడంలోనూ, ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలుపెట్టామో మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు వెనక్కితిరిగి మూలాల్ని వెదుక్కొనే ప్రయత్నం చేస్తుండాలి. అదే ఈ సినిమా.


ఇది హీరో సినిమానా? హీరోయిన్‌ సినిమానా? అని అడక్కుండా కథ ఉన్న సినిమా అని చేసినందుకు నితిన్‌కి కృతజ్ఞతలు. అనసూయ పాత్రకి సమంత ప్రాణప్రతిష్ఠ చేసింది. మిక్కీ జె.మేయర్‌ పాటలు, చిత్రం అందరికీ నచ్చుతాయని నమ్ముతున్నా'' అన్నారు.

English summary
Here comes Trivikram's "A..Aa" theatrical trailer of the film. Let's see how it is.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu