»   » నితిన్ లాభాల లెక్క: మొన్న పవన్, ఇపుడు నాగార్జున!

నితిన్ లాభాల లెక్క: మొన్న పవన్, ఇపుడు నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ కేవలం సినిమా హీరోగా మాత్రమే పరిమితం కాకుండా.....డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో కూడా తన టాలెంటు చూపుతున్నాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం ఏరియా రైట్స్ సొంతం చేసుకున్న నితిన్ భారీగా లాభాలు ఆర్జించాడు.

తాజాగా నితిన్ కన్ను అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంపై పడింది. తాజాగా 'మనం' చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా ప్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంటుందని నితిన్ భావిస్తున్నాడు.

 Nitin will distribute 'Manam'

అన్నపూర్ణ స్టూడియాస్‌ పతాకంపై అక్కినేని మూడు తరాల హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్‌' ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.

ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
Nitin will distribute Akkineni multi-starrer Manam. Nithin owned Shresht Media has bought the Nizam rights of Manam for an unrevealed fancy price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu