For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భీమ్లా నాయక్ స్పెషల్ స్టిల్ లీక్.. నిత్యా మీనన్ తో పవర్ స్టార్ క్యూట్ స్మైల్!

  |

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమాతో ఈ ఏడాది తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో మరోసారి చూపించారు. ఆ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి మళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫామ్ లోకి వచ్చినట్లు చాలా క్లారిటీగా అర్థం అయ్యింది. ఆ సినిమాపై ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రభావం పడకపోతే కలెక్షన్స్ మరొక స్థాయిలో ఉండేవి అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఒక విధంగా సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకటించడంతో టికెట్ల రేట్లు ఒక్కసారిగా తగ్గి పోయాయి. లేకుంటే బాక్సాఫీస్ రికార్డులు మరొక విధంగా ఉండేవని టాక్ వచ్చింది.

  ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే భీమ్లా నాయక్ సినిమా పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇదివరకే విడుదలైన టీజర్స్ తో క్లారిటీ గా అర్థమైంది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న టువంటి అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా అంచనాలను మరో స్థాయికి పెంచుతూ వస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నిత్యమీనన్ కు సంబంధించిన మరొక స్టిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

   nitya menon and Pawan kalyan special look from bheemla nayak

  ఇద్దరూ కూడా చాలా సింపుల్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన అంత ఇష్టం పాటకు భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ కు సంబంధించిన స్పెషల్ క్యూట్ ఫోటో కూడా అద్భుతంగా ఉందని అభిమానుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ తో మొదటి సారి కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన విజయాలు లేవు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన పెట్టుకుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి మరొక కీలక పాత్రలో నటిస్తుండగా వివి.వినాయక్ అతిధి పాత్రలో నటించారు. ఇక తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

  మొదట ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లకు ఇంకా సరైన ధర రాకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ సమయంలో RRR సినిమా పోటీకి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రానా మీద నమ్మకంతో నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా పొంగల్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక చివరగా ప్రభాస్ రాధేశ్యామ్ కూడా అదే సమయానికి బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

  English summary
  nitya menon and Pawan kalyan special look from bheemla nayak
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X