»   » నిర్మాతకు నిత్యమీనన్ ఝలక్.. టైటిల్ విషయంలో ఫైట్!

నిర్మాతకు నిత్యమీనన్ ఝలక్.. టైటిల్ విషయంలో ఫైట్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ustad Hotel Released In Telugu as Janatha Hotel

  హీరో, హీరోయిన్స్ అంటే దర్శకుడు చెప్పినట్టు సీన్‌లో యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు.. తమకొచ్చే వినూత్నమైన ఆలోచనలను కూడా దర్శక, నిర్మాతలతో పంచుకొంటుంటారు. వాళ్ల సలహా నిజంగానే సినిమాకు ప్లస్ అవుతుందంటే దర్శక, నిర్మాతలు తప్పకుండా స్వీకరిస్తారు. ఇప్పుడు అలాగే ఓ హీరోయిన్ నిత్యమీనన్ సలహాను నిర్మాత కొండేటి స్వీకరించారు. హీరోయిన్ సలహా నచ్చడంతో సినిమా పేరునే మార్చేశారు. ఈ నెల 14న ఆమె నటించిన 'జనతా హోటల్' సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర నిర్మాత సురేష్ కొండేటి వెల్లడించారు.

  ఉస్తాద్ హోటల్‌ను జతగా అనే

  ఉస్తాద్ హోటల్‌ను జతగా అనే

  నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా తెరకెక్కిన ఉస్తాద్ హోటల్ చిత్రం మలయాళంలో ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో డబ్బింగ్ హక్కులు కొన్నాను. ఆ సినిమాకు తెలుగులో ‘జతగా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాం. ఆ టైటిల్‌తోనే తొలుత టీజర్‌ను విడుదల చేశాం.

  నిత్యామీనన్‌తో డిస్కషన్

  నిత్యామీనన్‌తో డిస్కషన్

  జతగా టైటిల్ విషయంలో నాకు, నిత్యామీనన్‌కు మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగింది. జతగా అనే టైటిల్ కంటే ‘జనతా హోటల్' అని పెడితే బాగుంటుందని నీత్యామీనన్ సజెస్ట్ చేసింది. నాకు కూడా ఆ టైటిల్ నచ్చడంతో చివరికి దాన్నే ఫిక్స్ చేశాం.

  అందరికి నచ్చేలా జనతా హోటల్

  అందరికి నచ్చేలా జనతా హోటల్

  జనతా హోటల్ టైటిల్ బయటకు వెళ్లడించగానే చూసినవాళ్లు, విన్నవాళ్లు కూడా అదిరిపోయిందని మెచ్చుకున్నారు. టైటిల్ విషయంలో ఫుల్ క్రెడిట్ అంతా నిత్యామీనన్‌కే.'' అంటూ సురేష్ కొండేటి కితాబిచ్చారు.

  జనతా హోటల్‌పై భారీ అంచనాలు

  జనతా హోటల్‌పై భారీ అంచనాలు

  ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ నటించిన తర్వాత నిత్యామీనన్ లీడ్ రోల్ నటిస్తున్న సినిమా కావడంతో జనతా హోటల్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్‌లో ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన మెసేజ్ ఉన్నట్లే ఈ సినిమాలోనూ ఓ మెసేజ్ ఉంది అని సురేష్ కొండేటి వెల్లడించారు.

  జర్నీ చిత్రం కంటే గొప్పగా

  జర్నీ చిత్రం కంటే గొప్పగా

  జనతా హోటల్ సినిమా సెకెండాఫ్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. నా బ్యానర్ ఎస్‌కే పిక్చర్స్ నుంచి వచ్చిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీలాంటి సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

  దుల్కర్ మరింత దగ్గరగా

  దుల్కర్ మరింత దగ్గరగా

  హీరో దుల్కర్ సల్మాన్ ‘మహానటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడనే నమ్మకం ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు కూడా ఆయన సమకూర్చిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.'' అని నిర్మాత సురేష్ కొండేటి చెప్పుకొచ్చారు.

  English summary
  Suresh Kondeti, who has earlier made films like Premisthe, Shopping Mall, and Journey, has bagged the rights of a Malayalam movie titled Ustad Hotel. Mahanati fame Dulquer Salman and Nitya Menon are the lead pair in the original movie which has become a huge hit in Mollywood. The movie is now being released in Telugu as Janatha Hotel on September 14.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more