»   » ఎవడ్రా నీకు సార్.... రానాను కొట్టిన బాలయ్య, పూరికి వార్నింగ్!

ఎవడ్రా నీకు సార్.... రానాను కొట్టిన బాలయ్య, పూరికి వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'నెం.1 యారి విత్ రానా' అనే టాక్ షోకు మంచి స్పందన వస్తోంది. ఈ షోకు వచ్చిన అతిథుల నుండి రానా రాబడుతున్న సమాధానాలు, రానా షోను నడిపిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇటీవల జరిగిన ఈ షోకు 'పైసా వసూల్' స్టార్ బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య, పూరి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ షోలో బాలయ్య ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు.

మీ సినిమా రోజే పుట్టాను

మీ సినిమా రోజే పుట్టాను

బాలయ్యను ఉద్దేశించి రానా మాట్లాడుతూ.... నేను పుట్టింది మీరు హీరోగా చేసిన ‘కథానాయకుడు' సినిమా రిలీజ్ రోజు. తర్వాత మీ షూటింగు చూస్తూ పెరిగాను, అలాంటి మీతో నేను ఇపుడు ఈ షో చేస్తుండటం ఆనందంగా ఉంది అని రానా చెప్పారు.

పూరి వస్తుంటే విజిల్స్ వేసిన బాలయ్య

పూరి వస్తుంటే విజిల్స్ వేసిన బాలయ్య

ఒక దర్శకుడు తనకు నచ్చితే ఆయనతో బాలయ్య ఎంత క్లోజ్‌గా ఉంటారో మరోసారి రుజువైంది. నెం1. యారి విత్ రానా షోలోకి ముందు బాలయ్య ఎంటరయ్యారు. తర్వాత పూరి వస్తున్నారని అనౌన్స్ చేయగానే.... బాలయ్య విజిల్స్ వేయడం గమనార్హం.

నా గురించి తెలిసే ముందే పెళ్లి చేశారు

నా గురించి తెలిసే ముందే పెళ్లి చేశారు

కెరీర్లో ఇప్పటి వరకు ఇంత మంది హీరోయిన్లతో పని చేశారు. ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ.... నా సంగతి తెలిసే తొందరగా పెళ్లి చేశారు అని చెప్పారు. వెంటనే పూరి అందుకుంటూ.... ఆయనకు పెళ్లి చేసి సెట్ లోకి పంపించేశారు, ఏం చేస్తాం... జరుగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అంటూ జోక్ చేశారు.

ఫోజులు కొట్టని బాలయ్య

ఫోజులు కొట్టని బాలయ్య

సాధారణంగా స్టార్ హీరోలు ఏదైనా టీవీ షోకు వస్తున్నారంటే.... కాస్త ఫోజులు కొడతారు. అక్కడ కావాలని తమ యాటిట్యూడ్ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బాలయ్య అలాంటివేమీ చేయకుండా తాను రియల్ గా ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించాడు. సెట్లోకి రావడంతోనే పైసా వసూల్ సాంగుకు డాన్స్ చేశారు.

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చా

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చా

పూరి తనను సెట్లో ఏమని పిలిచే వాడని ప్రస్తావన వచ్చినపుడు బాలయ్య స్పందిస్తూ.... మొదట్లో తనను సర్ అని పిలిచే వాడని, ఇక నుండి అలా పిలిస్తే చంపేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, తనను బాలా అని మాత్రమే పిలవాని చెప్పానని బాలకృష్ణ తెలిపారు.

నన్ను రెండు సార్లు కొట్టాడు

నన్ను రెండు సార్లు కొట్టాడు

వెంటనే రానా జోక్యం చేసుకుని......బాలయ్య తనను రెండు సార్లు కొట్టాడని ఆ సంఘటనను వివరించారు. నేనొకసారి బాలకృష్ణ గారిని సార్ అని పిలిస్తే ఎవడ్రా నీకు సార్ అంటూ ఒక్క దెబ్బ కొట్టాడని, ఇంకో సందర్భంలో అంకుల్ అనిపిలిస్తే కొట్టాడని రానా చెప్పారు.

పూరిని ఇమిటేట్ చేసిన బాలయ్య

పూరిని ఇమిటేట్ చేసిన బాలయ్య

ఈ షోలో బాలకృష్ణ పూరిని అనుకరించి నవ్వులు పూయించారు. పూరి తనకు కథ చెప్పేటపుడు ఎలా ఉన్నాడు, ఎంత ఇబ్బంది పడ్డారనే విషయం చేసి చూపించారు.

పూరితో సినిమా వద్దని చాలా మంది చెప్పారు

పూరితో సినిమా వద్దని చాలా మంది చెప్పారు

పూరితో సినిమా వద్దని చాలా మంది చెప్పారని, అవేవీ తాను పట్టించుకోలేదని బాలయ్య తెలిపారు. తనకు బాలయ్య చాలా కోపిష్టి అని, సినిమా ఆలోచన విరమించుకోవాలని కొందరు వారించినట్లు పూరి తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

బాలయ్య హంగామా

బాలయ్య హంగామా

తాను ఇంకా కుర్రాన్నే అంటూ బాలయ్య ఈ షోలో రచ్చరచ్చ చేశారు. గతంలో ఎన్నడూ సాగనంత ఎనర్జిటిక్‌గా....... బాలయ్య-పూరిలతో నెం.1 యారి విత్ రానా షో జరిగింది.

English summary
No 1 Yaari With Rana: Balakrishna, Puri Jagannadh Episod details. No.1 Yaari with Rana fall under the most entertaining shows recently.
Please Wait while comments are loading...