»   » ఆఖరుకు అనుష్క కూడా హ్యండ్ ఇచ్చేసినట్టేనా : మరి చిరు సరసన ఎవరు..?

ఆఖరుకు అనుష్క కూడా హ్యండ్ ఇచ్చేసినట్టేనా : మరి చిరు సరసన ఎవరు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏదైనా వుందీ అంటే అది చిరంజీవి 150 సినిమానే. అభిమానులే కాదు సాధారణ జనం నుంచీ, సినీ సెలబ్రిటీల దాకా చీంజీవి రాబొయే సిన్మా పై ఆసక్తిగా ఉన్నారు. కొందరు నటులు కూడా చిరు రీ ఎంట్రీ సినిమాలో కనిపించటానికి ఉత్సాహ పడుతున్నారు.

మెగా వారసులైతే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీ అంటూ పోటిపడుతున్నారు. ఇన్ని ఉన్నా ఒకే ఒక లోపం మాత్రం ఇంకా చిరు ని వెంటాడుతూనే ఉంది. టాలీవుడ్ లెజెండ్ సినిమాకు హీరోయిన్ మాత్రం దొరకటం లేదు. చిరంజీవి ఇమేజ్ తో పాటు ఏజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్.

ముందుగా ఈ సినిమాలో నటించడానికి నయనతార ని తీసుకుంటున్నట్టు ప్రకటించినా ఆవార్తలు నిజం కాదని తేలిపోయాయి. దాదాపుగా నయన్ కన్ఫామ్ అన్న టాక్ వినిపించింది. కానీ చివరి నిమిషంలో నయన్ ఈ ప్రాజెక్ట్ లో లేదని తేలిపోయింది. త్వరలోనే అనుష్క హీరోయిన్ గా చిరు 150 సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ భామ కూడా మెగాస్టార్ కు హ్యాండ్ ఇచ్చిందట.

No Anushka in Chiru 150th film

ప్రస్తుతం బాహుబలి 2, సింగం 3, భాగమతి సినిమాల్లో నటిస్తున్న ,,స్వీటి, ఇంత టైట్ షెడ్యూల్ లో చిరు సినిమాకు డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనని చెబుతోందట. మరో వారంలో సెట్స్ మీదకు వెళుతుందనుకున్న మెగాస్టార్ మూవీ ఇప్పుడు మరోసారి హీరోయిన్ వేటకు రెడీ అవుతోంది.

రోజు రోజుకీ సినిమా ఏదో ఒక కారణం తో వాయిదా పడుతూండటం తో రామ్ చరణ్ "తనీఒరువన్" లాంటి ప్రాజెక్టు మీద కూడా ఈ ప్రభావం పడుతోండటం తో పాటు. ఇప్పటికే డేట్లు ఇచ్చేసిన నటులు తీరా ఈ షూటింగ్ మొదలయ్యే సమయానికి వేరే పనుల్లో ఇరుక్కుపోతున్నారు. మరి మెగాస్టార్ రీ ఎంట్రీ కి సరైన స్వాగతం చెప్పటానికి ఏ భామ రానుందో మరి...

English summary
Anushka Out From Chiranjeevi's 150th Movie Kathilantodu
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu