»   »  పవన్‌ఫ్యాన్స్ కి ఇంకో బ్యాడ్‌న్యూస్

పవన్‌ఫ్యాన్స్ కి ఇంకో బ్యాడ్‌న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల‌...గోపాల డైరెక్ట‌ర్ డాలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కాట‌మ‌రాయుడు సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

'కాటమరాయుడు' సినిమాని ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలాఖరులోపు విడుదల చెయ్యడానికి డైరెక్టర్ డాలి, నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మార్చి నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణం లో ఫ్యాన్స్ ఈ మూవీ ఫై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


No audio launch for Katamarayudu


తాజాగా ఈ సినిమాకు సంబదించిన ఓ వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ కి సంబదించిన ఆడియో వేడుక జరపడం లేదట..ఒక్కో సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసి , ఆ తర్వాత అభిమానుల మధ్య గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు', రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', తాజాగా సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలకు ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు.


ఇప్పుడు తాజగా అభిమానులకు కొత్త డౌట్ వస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారా? అనేదే ఆ డౌట్. పాటలను డైరెక్ట్ గా విడుదల చేసి, ఆ తర్వాత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలనే యోచనలో చిత్ర యూనిట్ కూడా ఉన్నట్టు సమాచారం.అయితే ఈ ఆడియో వేడుక రద్దుగాని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి గాని ఇప్పటివరకు దర్శక, నిర్మాత, హీరోలనుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

English summary
We hear That Pawan Kalyan’s Katamarayudu will not have an audio launch and the makers have instead planned a grand pre release event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu