twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’లో సభ్యత్వం అవసరం లేదు: జెనీలియా

    By Bojja Kumar
    |

    తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో సభ్యత్వం తీసుకోకుండా మొండి చేస్తున్న కారణంగా హీరోయిన్ జెనీలియాపై నిషేదం విధించాలని 'మా" నిర్ణయించినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై జెనీలియా ఎట్టకేలకు స్పందించింది. ఈ వార్తలపై ఆమె మాట్లాడుతూ....'మా" తనపై ఎలాంటి నిషదం విధించడం లేదని, మీడియా ఈ విషయం అనవసర రాద్దాంతం చేస్తుందని మండి పడింది. తాను సౌతిండియా మూవీ అసోసియేషన్ లో సభ్యురాలిని, ఐదు బాషల్లోనూ నటిస్తున్నాను....సౌతిండియా మూవీ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నందున ప్రత్యేకంగా 'మా"లో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని జెన్నీ తన ట్విట్టర్ అకౌంట్లో తేల్చి చెప్పింది.

    తన అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, మీడియా తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి సినిమా వాళ్లను బ్లేమ్ చేస్తూ వార్తలు రాడయం కొత్తకాదు, ఇప్పుడు తన విషయంలో జరుగుతున్నది అదే అని జెనీలియా చెప్పుకొచ్చింది.

    నిషేదం వార్తలపై మా అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ....జెనీలియాపై నిషేదం విధిస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని, సభ్యత్వం తీసుకోకుంటే సహాయ నిరాకరణ చేస్తామని చెప్పామే తప్ప, నిషేదం లాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

    English summary
    “It’s not nice when people make you a target only because you are strong enough to take it. With no bans or notices issued against me. I hope people would understand the truth and stop making this an unnecessary battle. I’m very happy and proud that I belong to five industries and hope people understand that” Genelia tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X