»   » పవన్ ఆరోపణలు...కుట్రకు సాక్ష్యాలెక్కడ?

పవన్ ఆరోపణలు...కుట్రకు సాక్ష్యాలెక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే బయటకు లీకైన సంగతి తెలిసిందే. సినిమా లీకైనా....భారీ విజయం సాధించడంతో అంతా ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే ఇటీవల జరిగిన థాంక్యూ మీటింగులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...లీక్ వెనక కుంట్ర ఉందని, ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కుట్ర చేసి లీక్ చేసారని బాంబు పేల్చారు.

ఎవరినీ వదలను, అందరికీ బుద్ది చెబుతా అనే విధంగా సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఆరోపణలు, ఆయన వార్నింగుతో సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు....తెలుగు ప్రేక్షకుల లోకం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మరి నిజంగానే సినిమా లీక్ వెనక కుట్ర ఉందా? పవన్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసారు? అనే చర్చ సర్వత్రా మొదలైంది.

అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కుట్ర ఉందనే కోణాన్ని కనిపెట్టలేక పోయారు. మరి పోలీసులకు తెలియని కుట్ర రహస్యం పవర్ స్టార్‌కు ఎలా తెలిసింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు తెలిసినా...రాజకీయ ఒత్తిడితో ఆ విషయాన్ని కావాలనే బయట పెట్టడం లేదా? దీని వెనక ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఉన్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

లీక్ జరిగింది ఇలా....
ఆ చిత్రానికి ప్రొడక్షన్ అసిస్టెంటుగా పని చేసిన సి. అరుణ్ కుమార్ ఈచిత్రాన్ని బయటకు లీక్ చేసినట్లు పోలీసులు రెండు రోజుల్లో తేల్చేసారు. అరుణ్ దగ్గర నుంచి డీవీడీలు అతని స్నేహితుడు రవి వద్దకు వెళ్లాయి. రవి వాటిని కృష్ణా జిల్లాలోని తన స్నేహితుడు వి.సుధీర్ కుమార్‌కు అందజేసారు. పెడనకు చెందిన వీడియోగ్రాఫర్ పోరంకి సురేష్ వాటిని సుధీర్ కుమార్ దగ్గర నుంచి తీసుకుని దేవి మొబైల్స్‌కు చెందిన అనిల్ కుమార్ కు అందజేసాడు. అనిల్ వాటికి కాపీలు తయారు చేసి డీవీడీల రూపంలో అమ్మడం ప్రారంభించాడు. అప్పుడే సినిమా లీక్ విషయం బయటకు వచ్చింది. దీని వెనక ఎవరి ప్రమేయం లేదని, స్నేహితుల కోసమే వాటిని ప్రొడక్షన్ అసిస్టెంట్ సి. అరుణ్ కుమార్ పోలీసులకు వెల్లడించారు.

English summary
Police in Krishna district has not found any conspiracy in angle in the case of piracy of Pawan Kalyan's Attarintiki Daredi. The actor had alleged that there was a conspiracy behind the leak of his film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu