twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మెర్సల్’ తెలుగు వెర్షన్‌కు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు, రిలీజ్ ఎందుకు ఆగినట్లు?

    తెలుగు వెర్షన్ ‘మెర్సల్’ చిత్రానికి ఎలాంటి కట్స్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి అన్నారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘మెర్సల్’ తెలుగు వెర్షన్‌కు నో కట్స్..

    విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్' తెలుగులో 'అదిరింది' పేరుతో నిన్న(అక్టోబర్ 27)న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు.

    అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అయితే అందులో నిజం లేదు అంటున్నారు కేంద్ర సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి. మెర్సల్ తెలుగు వెర్షన్ 'ఆదిరింది' మూవీకి తాము ఇప్పటికే సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చామని, ఒక్క కట్ కూడా చేయలేదన్నారు.

    మరి ‘అదిరింది' సినిమా రిలీజ్ ఎందుకు ఆగినట్లు?

    మరి ‘అదిరింది' సినిమా రిలీజ్ ఎందుకు ఆగినట్లు?

    తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

     జిఎస్టీ వివాదం

    జిఎస్టీ వివాదం

    ‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీ‌ని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా.

    తెలుగులో మ్యూట్

    తెలుగులో మ్యూట్

    తెలుగు వెర్షన్లో వివాదాస్పద డైలాగులు మ్యూట్ చేసి మరీ సెన్సార్‌కు పంపారు నిర్మాతలు. దీంతో ఎలాంటి కట్స్ లేకుండానే తెలుగు సెన్సార్ క్లియర్ అయిపోయింది.

     అంతా సిద్ధమైంది కానీ..

    అంతా సిద్ధమైంది కానీ..

    తమిళ వర్షన్ ‘మెర్సల్' ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ ఆంధ్రా, తెలంగాణలో 700 థియేటర్లలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ సమయానికి చేతికి అందక పోవడం వల్లనే ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణంతో సినిమా రిలీజ్ ఆగిపోయిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

    English summary
    Tamil blockbuster "Mersal" will release in Telugu without any cuts at the insistence of the censor board, said the body's top boss, Prasoon Joshi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X