»   » చిరుతో గొడవలు లేవంటున్న మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న

చిరుతో గొడవలు లేవంటున్న మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమ కుటుంబానికి ఎప్పుడు కూడా తగాదాలు లేవని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న అంటోంది. ఏ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆమె ఆ విషయం చెప్పింది. గతంలో గొడవలు జరిగాయని వార్తలు వచ్చినప్పుడు తాను ఇక్కడ లేనని, అవి కూడా గొడవలు కావని, బయటి వాళ్లకు గొడవలు లాగా కనిపిస్తున్నాయని ఆమె అన్నది. రెండు కుటుంబాలకు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలున్నాయని చెప్పింది. అల్లు అర్జున్‌తో తనకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉందని ఆమె చెప్పింది.

బన్నీ పెళ్లికి తాను హాజరు కాకపోవడంలో ఏ విధమైన మతలబు లేదని, తాను అమెరికా వెళ్లాల్సి వచ్చిందని, అందుకే పెళ్లికి వెళ్లలేకపోయానని ఆమె చెప్పింది. ఈ విషయం తాను బన్నీకి ముందే చెప్పానని, తాను పెళ్లికి రాలేనని బన్నీకి చెప్పే వెళ్లానని ఆమె అన్నది. తెలుగు హీరోల్లో తనకు నాగార్జున అంటే ఎక్కువ ఇష్టమని చెప్పింది. తనకు ప్రేమకథలు ఎక్కువ ఇష్టమని కూడా చెప్పింది.

English summary
Mohan Babu's daughter Laxmi Prasanna clarified that her family has no differences with Chiranjeevi's family. She said that Allu arjun is her childhood friend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu