»   » ఇంక అనుమానాలే అక్కరలేదు.... పవన్ తన "బ్రదర్స్" విషయం తేల్చుకోనున్నాడు

ఇంక అనుమానాలే అక్కరలేదు.... పవన్ తన "బ్రదర్స్" విషయం తేల్చుకోనున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవునా..! కాదా..!! అదేఅయ్యుండొచ్చా..? అన్న అనుమానాలు ఇంక అక్కర లేదు. పవన్ కొత్త సినిమా కాటమ రాయుడు" పక్కా గా వీరం రేమేక్ అని తెలిసి పోయింది. మొన్నటిదాకా తెల్ల చొక్కా లుంగీ లలో పవన్ స్టిల్స్ చూసి వీఎరం అయుండొచ్చా లేదా అనుకున్నారంతా. అయితే క్లారిటీకి మాత్రం రాలేకపోయారు. ఎందుకంటే పవన్ గెతప్ తప్ప ఎక్కడా మిగిలిన పాత్రల ప్రసక్తి రాక పోవటమే. అయితే తాజాగా హీరో తమ్ముళ్ళుగా నటించటానికి నలుగురు యువ హీరోలకోసం ప్రయత్నాలు మొదలు పెట్టటం తో అందరికీ "కథ" అర్థమైపోయింది.

అజిత్‌ నటించిన 'వీరమ్‌' చిత్రం తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్‌కళ్యాణ్‌ ఉన్నారని సమాచారం. ముగ్గురు తమ్ళుళ్ళుకు పెద్ద అన్నయ్యగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే కథానాయకుడి కథగా 'వీరమ్‌' చిత్రం రూపొందింది. ఇటువంటి కథతో తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ ట్రీట్‌మెంట్‌, ప్రజంటేషన్‌, స్క్రీన్‌ప్లే, కామెడీ తమిళనాట విశేష ప్రేక్షకాదరణ పొందడానికి కారణాలుగా నిలిచాయి. ఇప్పుడు అదే కథలో నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి. పవన్ స్టైల్లో తీస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషేషాలు....

రోజుకో కొత్త రూమర్

రోజుకో కొత్త రూమర్


ఇంట్రెస్టింగ్ న్యూస్ : పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ డాలీ కాంబినేషన్ లో తెరకెక్కడానికి రెడీ అయిన కొత్త సినిమాపై రోజుకో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. పవన్ పొలిటికల్ గా బిజీ అయిపోవడంతో ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో అని నిన్నటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడేమో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.

 పవన్ కూడా సెట్లోకి అడుగుపెట్టేశాడు

పవన్ కూడా సెట్లోకి అడుగుపెట్టేశాడు


‘కాటమరాయుడు' ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. పవన్ కళ్యాణ్ కూడా సెట్లోకి అడుగుపెట్టేశాడు. మూడు నెలల్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది డాలీ అండ్ టీమ్. స్క్రిప్టు కూడా పక్కాగా ఉండటంతో అదేమంత కష్టం కూడా కాదంటున్నారు. పవన్ అనుకున్న ప్రకారం షూటింగుకి వస్తే ఈ ఏడాది ఆఖరుకల్లా సినిమా పూర్తయిపోవచ్చు.

వీరమ్ రీమేక్

వీరమ్ రీమేక్


ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏ చికాకూ లేకుండా త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ మీద దృష్టిపెట్టొచ్చు. ఇక ‘కాటమరాయుడు' కథ గురించి.. అందులోని పాత్రల గురించి బయటికి వస్తున్న సమాచారం తెలుసుకుంటుంటే.. ఈ సినిమా తమిళం లో అజిత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ "వీరం"కు రీమేక్ అని గతంలో జరిగిన ప్రచారం వాస్తవమే అని అర్థమవుతోంది.

 డేట్స్ సమస్య:

డేట్స్ సమస్య:


పవన్ ఇందులో మిడిలేజ్డ్ ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తున్నాడట. అందుకోసమే ఆమధ్య తెల్ల గడ్డం తో కనిపించాడు. "వీరమ్" కథని బట్టి చూస్తే హీరో సోదరుల పాత్రలు కూడా ముఖ్యమైనవే. మొదటి నుంచి చివరి వరకు కథలో సాగుతాయి. తమిళ్ లో బాగానే అయ్యింది గానీ ఇక్కద మాత్రం యువహీరోల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అందుకే ఆ పాత్రల కోసం కొందరు యువ నటులను సంప్రదించారు. పవన్ సినిమా అనగానే చేయడానికి కొందరు ముందుకు వచ్చినప్పటికీ, వారికి డేట్స్ సమస్య పట్టుకుందట.

 కమల్ కామరాజు:

కమల్ కామరాజు:


ఎందుకంటే, ఈ పాత్రలు పలు సన్నివేశాలలో కనిపిస్తాయి కాబట్టి, సుమారు ఏభై రోజుల బల్క్ డేట్స్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు అడగడంతో వారు వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో అతని నలుగురు సోదరుల్లో ఓ సోదరుడి పాత్ర పోషించడానికి కమల్ కామరాజు వారు అడిగిన డేట్స్ ఇచ్చాడట. దీంతో ఆయన ఓకే అయిపోయాడు. మరికొందరు ఎంపిక కావలసివుందట.

 మానస హిమవర్ష:

మానస హిమవర్ష:


ఇద్దరు కమల్ కామరాజు.. విజయ్ దేవరకొండ అని తేలిపోయింది. ‘కీచక' ఫేమ్ యామిని భాస్కర్.. మరో కొత్తమ్మాయి మానస హిమవర్ష.. హీరో తమ్ముళ్లను ప్రేమించే అమ్మాయిలుగా కనిపించబోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది ‘వీరమ్' రీమేక్ మాదిరే అనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ముందు దర్శకుడు అనుకున్న ఎస్.జె.సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇచ్చిన హింట్లు కూడా ఇది ‘వీరం' రీమేకే అన్న అభిప్రాయం కలిగించాయి.

 పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు:

పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు:


‘వీరమ్' సినిమా కొంచెం ‘పెద్దరికం' ఛాయలతో ఉంటుంది. ఈ సినిమాలో హీరోకు ఆడవాళ్లంటే పడదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఐతే అతడి నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. అది అన్నయ్య అంగీకరించడని భావించి.. అతడినే ఓ అమ్మాయి ప్రేమలోకి దించుతారు.

 50 రోజుల్లో

50 రోజుల్లో


50 రోజుల్లోనే మూవీకి సంబంధించి తన పార్ట్ ను పూర్తి చేసేయాలని పవన్ భావిస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి 50 రోజుల్లో ‘కాటమ రాయుడు' గా పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో షూటింగ్ ను పూర్తి చేస్తాడో చూడాలి. ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద న్యూస్ ఇంకోటి ఉండదేమో.

English summary
Pawan Kalyan is looking for some notable faces to play his brother characters in Katama Rayudu.Katamarayudu is an unofficial remake of Tamil hit Veeram. Pawan Kalyan is playing a middle aged faction leader character in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu