twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుకార్లని నమ్మకండి, ఆమెని కించపరిచే సినిమాకాదు: దర్శకుడి వీడియో, కథ మాత్రం అద్బుతం

    డిసెంబర్ 1న 'పద్మావతి' సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగుతున్న క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈసినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతినవని అన్నారు.

    |

    Recommended Video

    ఆమెని కించపరిచే సినిమాకాదు !

    సినిమాల మీద అసహనం ఈ మధ్య కాలం లో ఎక్కువగా కనిపిస్తున్న విషయం, కొన్ని సీన్ల విషయం లోనో, లేదా మరికొన్ని విషయాలలోనో అభ్యంతరం ఉంటే వాటివిషయంలో నిరసనలు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇంకా దిగజారింది. భౌతికదాడులు, థియేటర్లమీద దాడులూ ఎక్కువయ్యాయి.

     మెర్సల్ వేడి చల్లారక ముందే

    మెర్సల్ వేడి చల్లారక ముందే

    ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న "పద్మావతి" పరిస్థితి ఇదే. మొన్నటివరకూ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన మెర్సల్ వేడి చల్లారక ముందే ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమామీద నిరసనలు మామూలుగాలేవు. దాదాపు దేశవ్యాప్తంగా బందులూ,నిరసనలూ జరుగుతున్నాయి.

     థియేటర్లని తగలబెడతాం

    థియేటర్లని తగలబెడతాం

    మొన్నటికి మొన్న ఆ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లని తగలబెడతాం అంటూ బహిరంగంగానే హెచ్చరించాడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అయితే దీనిపై సంజయ్ లీలా బన్సాలీ మరో సారి వివరణ ఇచ్చాడు. 'పద్మావతి' సినిమాతో రాణి 'పద్మావతి'కి ఎలాంటి అవమానం జరగదని తెలిపాడు.

     ఎవరి మనోభావాలు దెబ్బతినవు

    ఎవరి మనోభావాలు దెబ్బతినవు

    డిసెంబర్ 1న 'పద్మావతి' సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగుతున్న క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈసినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతినవని అన్నారు. 'పద్మావతి' సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలేనని చెప్పాడు.

     పుకార్లను ఎవరూ నమ్మవద్దు

    పుకార్లను ఎవరూ నమ్మవద్దు

    తాను సినిమాను వివాదం కోసమో లేక ఎవరినో కించపరచాలని తీయనని ఆయన స్పష్టం చేశారు. తాను 'పద్మావతి' గురించి తెలుసుకుని స్పూర్తి పొందానని ఆయన చెప్పారు. తమ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. తమ సినిమా రాణి 'పద్మావతి' కీర్తి పెంచుతుందే కానీ ఆమె ప్రతిష్ఠను దిగజార్చదని ఆయన భరోసా ఇచ్చారు.

    'పద్మావతి' అనే రాణి లేనే లేదు

    'పద్మావతి' అనే రాణి లేనే లేదు

    ఆధునిక భారతదేశ చరిత్రలో 'పద్మావతి' అనే రాణి లేనే లేదని చరిత్రకారుడు గంగరాజు స్పష్టం చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ భారత దేశ చరిత్రలో ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. పద్మావతి అనేది ఓ నవలారచయిత ఊహల రాణి అని ఆయన తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కామాంధుడన్న కారణంతో ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయేమోనని రాజ్ పుత్ లు ఆందోళన చెందుతుండి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

     వెనుదిరిగి ఉన్నప్పుడు అద్దంలో

    వెనుదిరిగి ఉన్నప్పుడు అద్దంలో

    అంతే కాకుండా ఆ నవలలో పద్మావతిని నేరుగా చూపించడం ఇష్టం లేక ఆమె వెనుదిరిగి ఉన్నప్పుడు అద్దంలో ఆమెను అల్లావుద్దీన్ ఖిల్జీ చూసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. ఇదంతా ఊహాజనితమైన కథేనని ఆయన స్పష్టం చేశారు.

    రావల్ రతన్ సింగ్ ని ఓడించి

    వాస్తవ చరిత్రలో ఏం జరిగిందంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ.. మేవార్ పై దాడి చేసి రావల్ రతన్ సింగ్ ని ఓడించి, అతని భార్య కమలాదేవిని బందీగా తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడని ఆయన చెప్పారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి పనిమనుషులు, బానిసలు అన్న తేడా ఉండేది కాదని, పనిమనిషితో కూడా లైంగిక సంబంధాలు ఉండేవని ఆయన చెప్పారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని ఆయన తెలిపారు.

    English summary
    Sanjay Leela Bhansali clarified in a new video released by the official Facebook page of Padmavati that the rumours about a dream sequence in the film are baseless.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X