»   » ఆ సినిమా నుంచి తప్పుకోవటం మంచిదయ్యింది

ఆ సినిమా నుంచి తప్పుకోవటం మంచిదయ్యింది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : కొన్ని సినిమాల్లో ఆఫర్స్ మిస్సయ్యాయని హీరో,హీరోయిన్స్ ఫీలవుతూంటారు. మరికొన్ని చేయనందుకు ఆనందపడుతూంటారు. మొదటి సినిమా అవకాశమిచ్చి కత్రినా కైఫ్‌కి లైఫ్‌ కల్పించిన 'బూమ్‌' చిత్ర దర్శకుడు కైజాద్‌ గుస్తాద్‌ కొత్త చిత్రం 'జాక్పాట్‌' ప్రీమియర్‌కి కత్రినా గైర్‌ హాజరైంది. షారుఖ్‌ ఖాన్‌, శ్రీదేవి శర్మ వంటి బాలివుడ్‌ సెలెబ్రెటీలందరూ హాజరైనా ఈమె మాత్రం కనపడలేదు. కైజాద్‌ బ్యాడ్‌ లక్‌ ఏమో కానీ ఈ చిత్రం 13న విడుదలై నిరాశాజనకమైన ఫలితాలను నమోదు చేసింది.

  Katrina Kaif

  కైజాద్‌ ఫోన్‌ కాల్స్‌కి కానీ, ఎస్‌.ఎం.ఎస్‌.లకు గానీ కత్రినా అందుబాటులో కూడా లేదు. కైజాద్‌ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. 12న జరిగిన ప్రీమియర్‌ షోకి ఆహ్వానాలు పంపింది నిర్మాతలు, పంపిణీదారులే కానీ తను మాత్రం కాదన్నాడు. కత్రినాతో తను కాంటక్ట్‌లో లేనన్నాడు. జాక్పాట్‌ చిత్రంలో కత్రినా నటించనుందని వార్తలు వెలువడినా ఆ పాత్ర సెక్స్‌ బాంబ్‌ సన్నీలియోన్‌కి దక్కింది.

  కథలో పసలేని చిత్రంగా జాక్పాట్‌కి పేరొచ్చింది. సన్నీలియోన్‌తో 'సెక్స్‌'పోజ్‌ చేయించి పబ్బం గడుపుకోవచ్చనే ఆలోచన బెడిసికొట్టింది. సన్నీ 'సెక్స్‌'పోజింగ్‌ పాటకు సెన్సార్‌ వారు కత్తెర కూడా వేశారు. యూ ట్యూబులో పెట్టిన ఈ పాట గాయబ్‌! ఈ సంగతులన్నీ ముందే పసిగట్టిందో ఏమో కత్రినా మాత్రం తెలివిగా తప్పుకుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో చెప్తోందని వినికిడి.

  English summary
  Katrina Kaif was invited last night for her debut film (Boom) director Kaizad Gustad’s comeback and Sunny Leone-Sachiin Joshi-starrer Jackpot’s premiere. But the actress was not seen at the event. Says an insider, “Kaizad has been trying to contact Katrina for the last couple of days. He has messaged and called her but she hasn’t responded at all.” However Kaizad says, “I have not invited Katrina personally. The event management company may have contacted her and sent her an invite. It’s common courtesy to invite everybody in the film industry so they would have sent out a whole bunch of invites.” He stresses that he hasn’t talked to her, “I am not in touch with her at all.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more