»   »  నేను ఇంకా చిన్నపిల్లోడ్నే.. ఇప్పుడే పిల్లలు వద్దంటున్న రాంచరణ్

నేను ఇంకా చిన్నపిల్లోడ్నే.. ఇప్పుడే పిల్లలు వద్దంటున్న రాంచరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పిల్లల్ని కనే ఉద్దేశం ఇప్పుడే లేదని, మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 'ఇంకా చిన్న పిల్లాడనని నేను భావిస్తుంటాను. ఇంకా మెచ్యురిటీ రావాలి. పెద్దవాడినవ్వాలి. నన్ను నేను హ్యాండిల్ చేసుకొనే శక్తి వచ్చినపుడు పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు అలాంటి ప్లాన్స్ లేవు' అని రామ్ చరణ్ అన్నారు.

ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోకి ఓ కొత్త సభ్యుడిని ఆహ్వానిస్తున్నారని, మీ ఇంట్లోకి బుల్లి హీరో ఎప్పుడు వస్తున్నాడని అడిగిన ప్రశ్నకు ముసిముసిగా నవ్వుతూ పై విధంగా స్పందించారు.

No kids now.. I have no such plans says Ram charan

ఖైదీ నంబర్ 150 తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ లేదని, ప్రస్తుతం ఇంటిని రెనోవేషన్ పనులపై దృష్టిపెట్టామని రామ్ చరణ్ తెలిపారు. నాన్నగారు ఎప్పటి నుంచో ఇంటిలో మార్పులు, చేర్పులు చేపట్టాలని అనుకొంటున్నామన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంటి పునర్నిర్మాణం చేస్తున్నామని మెగా పవర్ స్టార్ వెల్లడించారు. ఉపాసన తమ కుటుంబంలోకి కొత్తగా ప్రవేశించిందని, ఆమె అభిరుచులకు తగినట్టుగా కూడా నివాసాన్ని రీడిజైన్ చేస్తున్నామని అన్నారు.

English summary
I still feel like I'm a kid, when I can handle myself as an adult, then think about children, says Ram charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu