»   » ఆశ్చర్యం: హగ్గులు లేవు...కిస్సులు అసలే లేవు

ఆశ్చర్యం: హగ్గులు లేవు...కిస్సులు అసలే లేవు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ సినిమాలంటే ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్ని లవ్ సీన్లయితే కిస్సులు, హగ్గింగులతోమరీ పచ్చిగా ఉంటాయి. అయితే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న ‘ఆంధ్రపోరి' చిత్రం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందట. అసలు ఈ సినిమాలో కిస్సులు, హగ్గింగులు లాంటివి అసలే ఉండవంట.

ఆకాష్ పూరి ఈ విషయమై మాట్లాడుతూ...మా నాన్న నన్ను 21 ఏళ్ల తర్వాత హీరో చేయాలనుకున్నారు. కానీ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నపుడే 17 ఏళ్ల వయసులోనే ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆయన హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా స్టోరీ నా వయసుకు తగిన విధంగా ఉంటుంది అన్నారు.

No kissing and hugging scenes in Andhra Pori

కన్నడలో హిట్టయిన ‘టైంపాస్' చిత్రాన్ని తెలుగులో ‘ఆంధ్రపోరి' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఝాన్సీకా రాణీ ఫేం ఉల్కా గుప్తా హీరోయిన్‌గా చేస్తోంది. హీరోయిన్ తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను. షూటింగ్ సమయంలో చాలా సరదాగా గడుపుతున్నామని తెలిపాడు ఆకాష్.

చూడ్డానికి సినిమా టైటిల్ నాటీగా ఉన్నప్పటికీ....సినిమాలో హగ్గింగ్స్, కిస్సింగ్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇదొక డీసెంట్ మూవీ. మా అమ్మ గైడెన్స్ లోనే షూటింగుకు అటెండ్ అవుతున్నానని ఆకాష్ పూరి చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు చిత్రాల్లో బాల నటుడిగా తన టాలెంట్ చాటుకున్న ఆకాష్....హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు.

English summary
'There are no kissing and hugging scenes in Andhra Pori. He adds that he is attending the shoot under his mom's guidance.' Akash Puri said
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu