»   » ‘వంగవీటి’ సినిమా తర్వాత....టాలీవుడ్ నుండి రామ్ గోపాల్ వర్మ ఔట్

‘వంగవీటి’ సినిమా తర్వాత....టాలీవుడ్ నుండి రామ్ గోపాల్ వర్మ ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రియల్ లైఫ్ స్టోరీలు తీయడం, వివాదాస్పద చరిత్రలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వారు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదేమో. గతంలో పరిటాల రవీంద్ర జీవితంపై ‘రక్త చరిత్ర' సినిమా తీసిన వర్మ సక్సెస్ అయ్యాడు. ఇటీవల వీరప్పన్ జీవితం ఆధారంగా తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్' చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

తాజాగా ఆయన మరో వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుట్టారు. వంగవీటి హత్యోదంతంపై....ఆయన జీవితంపై సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఇక తెలుగులో వర్మ సినిమాలు ఉండక పోవచ్చు. 'వంగవీటి' సినిమా తర్వాత తాను తెలుగులో సినిమాలు తీయనని స్వయంగా రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

షాక్: ‘వంగవీటి'లో రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ముద్రగడ, దాసరి పాత్రలు...

వర్మ ఇలాంటి ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు.... గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘గోవింద' చిత్రానికి సెన్సార్ కట్స్ ఎక్కువగా చేసారంటూ కోపగించుకున్న వర్మ ఇకపై తెలుగులో సినిమాలు తీయనని ప్రకటించి, ముంబై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హిందీలో 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'సర్కార్' వంటి సంచలనాత్మక సినిమాలు తీసి, విజయం సాధించారు. తరువాత తన నిర్ణయం మార్చుకుని 'అనగనగా ఒకరోజు' నుంచి వరుసగా సినిమాలు చేశారు.

ఇపుడు ఆయన తీస్తున్న ‘వంగవీటి' సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు తీయనని ప్రకటించారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా, నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. "వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది.. "శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. అని తెలిపారు.

వంగవీటి

వంగవీటి

విజయవాడలో కులాల కుంపట్లు రగిల్చిన చరిత్రపై 'వంగవీటి' సినిమా తీస్తున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ, ఇదే తెలుగులో తన చివరి చిత్రమని వెల్లడించారు.

ఇతడే....

వర్మ సినిమాలో కనిపించే వంగవీటి రాధా క్యారెక్టర్ చేసేది ఇతడే..

సినిమాలో..

సినిమాలో..

ఈ చిత్రంలో రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నారని అంటున్నారు. రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.

వార్నింగులు

వార్నింగులు

వార్నింగ్ లు.. వర్మకు వార్నింగ్ లు కొత్తేమీ కాదు. రీసెంట్ గా ఆయన వంగవీటి టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పటినుంచి వార్నింగ్ లు మొదలయ్యాయి.

English summary
"I don't do movies in Telugu after Vangaveeti" RGV says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu