»   » 'సినిమా పరిశ్రమను తరలించాల్సిన అవసరం లేదు'

'సినిమా పరిశ్రమను తరలించాల్సిన అవసరం లేదు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ నుండి తరలించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ ఈ విషయమై మాట్లాడుతూ....ఉద్యమ సమయంలో తామెప్పుడూ సిని పరిశ్రమను ఇక్కడి నుండి తరలించాలని కోరలేదని, అలా ఆలోచన లేదు, ఇకపై ఉండదు కూడా అని ఆయన స్పష్టం చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

No Need For Film Industry To Shift From Hyd, Says Kodandaram

తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, పలు ప్రోత్సహకాలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని కోదండరామ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోందని కోదండరామ్ తెలిపారు.

భవిష్యత్తులు మరిన్ని సినీ స్టూడియోలు, ఫిల్మ్ సిటీలు ఇక్కడ వెలుస్తాయని...తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంటేనే ప్రయోజం కలుగుతుందని కోదండరామ్ చెప్పుకొచ్చారు. భౌగోళికంగా కూడా హైదరాబాద్ నగరం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని కోదండరామ్ చెప్పుకొచ్చారు.

English summary
No Need For Film Industry To Shift From Hyderabad, Says Telangana JAC chairman Kodandaram.
Please Wait while comments are loading...