»   » ‘జై లవ కుశ’ రివ్యూ రాయని మహేష్ కత్తి, కారణం ఏంటో తెలుసా...?

‘జై లవ కుశ’ రివ్యూ రాయని మహేష్ కత్తి, కారణం ఏంటో తెలుసా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌గా, పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవ కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి..... అంతకంటే ముందే ఫిల్మ్ క్రిటిక్‌గా టాలీవుడ్లో ఫేమస్. ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా టాలీవుడ్లోని అగ్రహీరోల సినిమాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ తన రివ్యూల్లో విమర్శలతో ఏకిపారేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆయన కొందరు హీరోల అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు. వీరిలో అందరికంటే ఎక్కువగా రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ అభిమానులు. కొన్ని రోజుల క్రితం మహేష్ కత్తికి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. ఈ ఇష్యూను నేషనల్ మీడియా కూడా కవర్ చేసిందంటే... ఆ గొడవ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.


ఏ సినిమాను వదలని మహేష్ కత్తి

ఏ సినిమాను వదలని మహేష్ కత్తి

ఏ సినిమా అయినా అందులో లోపాలుంటే ఏకి పారేసే.... మహేష్ కత్తి ‘బాహుబలి' లాంటి సినిమాలను, టాలీవుడ్లో భారీ హిట్టయిన చిత్రాలను సైతం వదల్లేదు. తనదైన పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శలు చేశారు.


తారకను పొగిడిన నోటితో...

తారకను పొగిడిన నోటితో...

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్' షోలో పాల్గొని, షో నుండి ఎలిమినేషన్ సమయంలో తారక్‌‍ను కలిసిన మహేష్ కత్తి... తర్వాత జరిగిన టీవీ ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని పొగిడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూవీ ‘జై లవ కుశ' సినిమాపై ఆయన రివ్యూ ఎలా ఉండబోతోంది? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.


‘జై లవ కుశ’ రివ్యూ కోసం ఎదురుచూస్తున్న వారికి మహేష్ కత్తి షాక్

‘జై లవ కుశ’ రివ్యూ కోసం ఎదురుచూస్తున్న వారికి మహేష్ కత్తి షాక్

‘జై లవ కుశ' సినిమాకు మహేష్ కత్తి ఎలాంటి రివ్యూ రాస్తారు? అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో అందరికీ షాక్ ఇస్తూ..... తాను ఈ రోజు రివ్యూ రాయడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు మహేష్ కత్తి. తాను ముంబై వెలుతున్నట్లు తెలిపారు.
సినిమా వాళ్ల గురించి ఓ పోస్టు

సినిమా వాళ్ల గురించి ఓ పోస్టు

తాను రివ్యూ రాయడం లేదు, ముంబై వెలుతున్నాను అని పోస్టు పెట్టిన కొంత సేపటికే...... మహేష్ కత్తి మరో సోషల్ మీడియా పోస్టు పెట్టారు. "సినిమావాళ్ళు ఇట్ల. సినిమావాళ్ళు అట్ల. ఇన్ని కష్టాలు. ఎంత ప్యాషన్. ఎంత సహనం...అని సెల్ఫ్ పిటీ ఎందుకో నాకు అర్థం కాదు. ఏదో ఆశతోనో, తెలిసినదో తెలియనిదో పిఛ్చితోనో ఇక్కడికి వచ్చాం. మన బాధ మనది. ఎవరిని అడిగి రాలేదు. ఎవరో ఏదో చేసేస్తారని ఆశించి రాలేదు. మన బాధలతో ఎవరికీ పనిలేదు. బాధపడి, న్యూనపడి మనం సాధించేది ఏమీ లేదు. కాబట్టి రొమాంటిసైజింగ్ ఆపండి. Let's get on to work." అని వ్యాఖ్యానించారు.


మళ్లీ బిగ్ బాస్ ఇంటికి

మహేష్ కత్తి అసలు ‘జై లవ కుశ' సినిమాపై అసలు రివ్యూ ఎందుకు రాయడం లేదు అనే ఆలోచనలో పడ్డవారికి కొంతసేపటి తర్వాత క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు బిగ్ బాస్ లో ఇప్పటి వరకు కంటెస్ట్ చేసిన వారంతా కలిసి మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వెలుతున్నట్లు తెలిపారు. సంపూర్ణేష్ బాబు, సమీర్, జ్యోతి, ధనరాజ్, మధు ప్రియతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోను పోస్టు చేశారు.
బ్యూటిఫుల్ డ్రైవ్

ముంబై నుండి లోనావాలా వెళ్లే దారిలో వాతావరణం చాలా బావుందని, డ్రైవ్ బ్యూటిఫుల్ గా ఉందంటూ మహేష్ కత్తి ఓ పోస్టు చేశారు.


English summary
"No review today...I am off to Mumbai. Going to Bigg Boss house... again" Mahesh Kathi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu