For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్వెల్‌ రాదు... లేదు .. : తేల్చి చెప్పిన మహేష్‌బాబు

  By Srikanya
  |

  విజయవాడ: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో పెద్దోడికి పెళ్లి జరిగింది, చిన్నోడు పెళ్లి కోసం సీక్వెల్‌ తీసే ఆలోచన ఏమైనా ఉందా? అని అడిగితే... 'చిత్రంలో బామ్మ పాత్ర ఒక మాట అంటుంది. పెద్దోడి పెళ్లి జరిగిన సాయంత్రమే చిన్నోడి పెళ్లి జరుగుతుందని. అంటే చిన్నోడి పెళ్లి కూడా జరిగిపోయినట్లే. సీక్వెల్‌ రాదు... లేదు' మహేష్ తేల్చి చెప్పారు. విజయవాడలో ఓ కార్యక్రమానికి వచ్చిన మహేష్‌బాబు చిత్రనిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మీడియాతో మాట్లాడారు.

  దూకుడు, బిజినెస్‌మ్యాన్‌ వంటి మాస్‌ చిత్రాల తరువాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కుటుంబ కథ రిస్క్‌ అనిపించలేదని తనకు ఈ చిత్రం చాలా సేఫ్ ప్రాజెక్టు అనిపించే ఒప్పుకున్నానని మహేష్ అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... ' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిస్క్ అనుకుని లేదు. ఈ చిత్రం చాలా సేఫ్‌ ప్రాజెక్టని ఒప్పుకున్నాను. ఇప్పుడు అదే నిజమైంద'ని సమాధానమిచ్చారు.

  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కథ పదినిమిషాలు విన్నగానే తనకు మంచి అనుభూతి కలిగిందని, ఇప్పుడు థియేటర్లో కూర్చుని చూస్తున్న ప్రేక్షకులూ అదే అనుభూతికి లోనవుతున్నారని ఆ చిత్ర కథానాయకుడు ప్రిన్స్‌ మహేష్‌బాబు అన్నారు. ప్రతి వ్యక్తికి నిత్యజీవిత అనుభవాలు, ఉత్తమ జీవన విలువలతో (లైఫ్‌ కనెక్టివిటీ)తో కూడిన ఇలాంటి చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం మల్టీస్టారర్‌ సినిమా అనే సంగతిని ప్రేక్షకులు మరచిపోయేటట్లు చేసిందని చెప్పారు.

  ఇక మంచి చిత్రం తీయాలనే ఆలోచనతో దీనిని ప్రారంభించామని, ఇంత పెద్ద విజయం సాధిస్తుందని వూహించలేదన్నారు. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌ అనొద్దని, ప్రేక్షకులు అసలు అలాంటి ఆలోచనే చేయడంలేదన్నారు. వెంకటేష్‌ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని, అలాగే కథలను అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని కితాబిచ్చారు. ప్రస్తుతం సుకుమార్‌ చిత్రం షూటింగ్‌లో ఉందని, మిగిలిన ప్రాజెక్టుల గురించి ఖరారయ్యాకే వెల్లడిస్తానని మహేష్‌ తెలిపారు.

  బాలీవుడ్‌ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు... 'అయినా ఇప్పటికే అక్కడ చాలామంది ఉన్నారండీ, మనమెళితే ఫ్త్లెట్‌ ఎక్కించి పంపించేస్తారు' అని ఛలోక్తి విసిరారు. అలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. విజయవాడతో అనుబంధం గురించి మాట్లాడుతూ... విజయవాడ తనకు సెంటిమెంటుగా మారిందని, ఒక్కడు, దూకుడు చిత్రాల వేడుకలు నగరంలోనే జరిగాయని చెప్పారు. పోకిరి విజయం తరువాత కూడా తాను విజయవాడ వచ్చానని, ఈ నగరం తనకు ఆత్మీయంగా అనిపిస్తుందని పేర్కొన్నారు.

  English summary
  Mahesh Babu ’s latest released film SVSC is raking in moolah. SVSC has get Super Hit Talk at the Box-Office in its very first weekend. But even after such good collections, it seems that superstar is not interested in making the sequel of SVSC. In an interview Mahesh Babu said that he personally enjoys family drama but he and his SVSC team is not planning for any sequel of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X