»   » అంత పెద్ద విషయాన్ని రేణూదేశాయ్ తేలిగ్గా తీసిపడేసింది

అంత పెద్ద విషయాన్ని రేణూదేశాయ్ తేలిగ్గా తీసిపడేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రపంచం మొత్తం అమెరికా ఎన్నికల పైనే దృష్టినిలిపింది... అగ్రరాజ్య ప్రజలు ఈసారి ఎన్నుకోబోయేది ప్ర్థమ మహిళనా...ప్రథమ పౌరున్నా అనే విసయం లో అంతా ఉత్కంటగా ఉన్నారు. ఇటీవల అమెరికాలో విడతలవారీగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించి డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు.

  ఇన్నేళ్ల కాలంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి మహిళ ఎవరూ లేరు. అది హిల్లరీ క్లింటన్ కావడంతో ప్రపంచం అంతా ఉత్సుకతతో చూస్తుంది. ట్రంప్ పైన గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.

  renu desai

  సాధారణం గానే ప్రపంచ అగ్రరాజ్య అధినేతగా ఒక మహిళ ఎన్నిక కావటం ఒక చారిత్రక ఘట్టమే ఔతుంది అన్నంత ఉద్వేగ పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ మాత్రం ఇందులో ఏముందీ అంటూ తేలిగ్గా చప్పరించేసారు. "నాకైతే ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కల్గించడంలేదు అంటూ." ట్విట్టర్లో ఈ విషయమై ఆమె ఓ పోస్ట్ చేసి మరోసారి చర్చలోకి వచ్చారు.

  ఇంతకీ ఆమె ఏమన్నదంటే... నేటివరకూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే అమెరికాలో మహిళ ఇంతవరకూ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించలేదు. చాలా దేశాలు ఈ ఫీట్‌ను ఎప్పుడో దాటేశాయి. చిన్న దేశాల్లో సాధ్యమైంది అంత పెద్ద దేసంలో జరగటం మామూలే కదా,కాబట్టి ఇప్పుడు హిల్లరీ అధ్యక్ష పదవి కోసం పోటీపడటంలో ఆశ్చర్యం ఏముందీ అంటూ కామెంట్ చేశారు.

  నిజమే కదా...! ప్రపంచం లో ఎన్నో చిన్న దేశాలయిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక,ఇండోనేషియా వంటి ఎన్నో దేశాల్లో చాలా సార్లే మహిళా అధ్యక్షులూ,ప్రధానమంత్రులూ అయినప్పుడు అన్నిటాముందున్న అమెరికాలో మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటంలో మరీ అంత ఆశ్చర్యం ఏముందీ...?

  English summary
  “USA,being the “first country” of d world,has surprisingly,no female president till date!Just talk abt equality in job opportunities!Archaic?Almost, all the developed countries of the world have had female Presidents or Prime ministers, hence the fact USA doesn’t, surprises me!,” tweeted Renu Desai who is Pawan Klayans ex-wife.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more