»   » పాపం రేణూ దేశాయ్: అకిరానందన్ నటించిన సినిమా అయినా ఎవ్వరూ చూడటం లేదు

పాపం రేణూ దేశాయ్: అకిరానందన్ నటించిన సినిమా అయినా ఎవ్వరూ చూడటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ సినీ రంగంలోనే కెరీర్‌ వెతుక్కుంది. మరాఠీలో ఒక సినిమా నిర్మించిన రేణు దేశాయ్‌ ఆ తర్వాత దర్శకురాలిగాను మారింది. ఆమె దర్శకత్వంలో రూపొందిన 'ఇష్క్‌వాలా లవ్‌" తెలుగులో కూడా చేయాలనుకుంది, చేసింది కూడా .. అయితే అసలు బయ్యర్లు రాకపోవడంతో అది విడుదల కాలేదు. పవన్‌ తనయుడు అకిరానందన్‌ చిన్న పాత్ర చేసాడనే ప్రచారం కూడా ఆ చిత్రానికి క్రేజ్‌ తెచ్చిపెట్టలేదు. కనీసం ఎవ్వరూ ఆ సినిమా గురించి పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు.

పాపం థియేట్రికల్‌ రిలీజ్‌ కుదరకపోవడంతో తన 'ఇష్క్‌వాలా లవ్‌' చిత్రాన్ని డైరెక్ట్ గా తన యూట్యూబ్‌ ఛానల్‌లోనే ఉచిత ప్రదర్శనకి పెట్టింది రేణు దేశాయ్‌. అయితే ఇక్కడ కూడా పెద్దగా స్పందన ఏమీ లేదు. ఈ సినిమాని అప్‌లోడ్‌ చేసి మూడు రో జులు అవుతున్నా కానీ ఇంతవరకు పదివేల వ్యూస్‌ కూడా దాటకపోవటం మరీ దారుణం. నిజానికి ఈ మధ్య ఏ వీడియో అయినా ఈ జియో అన్ లిమిటెడ్ డాటావల్ల సూపర్హిట్ అయిపోతోంది. ఇదీ అదీ అన్న తేడాలేకుండా ప్రతీ వీడియో వైరల్ అయిపోతున్న సమయం లో కూడా ఈ సినిమా కనీసం మినిమం వ్యూస్ కూడా సంపాదించుకోలేక పోవటం దారుణమే.

No viewers for Renu Desai film on YouTube

రేణుకి సరిగా మార్కెటింగ్‌ చేసుకోవడం రాలేదో ఏమో కానీ ఇష్క్‌వాలా లవ్‌ యూట్యూబ్‌లోను వెలవెలబోతోంది. పోనీ చూసిన వాల్లేమైనా మెచ్చుకున్నారా అంటే అదీ అలేదు. అసలు ఆ సినిమా రేణూ తీయకపోయినా బావుండేది అన్నదే అందరి అభిప్రాయమూ. పాపం ఈ విధంగా రేణూ కష్టం యూట్యూబ్ లో పోసిన పన్నీరయ్యింది. 

Renu Desai Ready To Reveal About Pawan Kalyan on March 8 - Filmibeat Telugu
English summary
Renu Desay dubbed the Marathi movie “Ishq Wala Love" into Telugu, uploaded it on Youtube and it is available for free. But in the last four days, the video on YouTube could not garner even twenty thousand views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu